
సాక్షి, తాడేపల్లి: ఇచ్చిన మాట ప్రకారం వైఎస్సార్ వాహనమిత్ర రెండో విడత కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ప్రారంభించారు. అనంతరం పలు జిల్లాల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లబ్ధిదారులతో సీఎం మాట్లాడారు. తమను ఆర్థికంగా ఆదుకున్నందుకు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వం తమ కష్టాలను పట్టించుకోలేదని, కరోనా వంటి కష్టకాలంలో కూడా ఆర్థికంగా ఆదుకున్నందుకు జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. ‘అమ్మ ఒడి’ పథకంతో తమ పిల్లలను చదివించుకుంటున్నట్లు సీఎంతో కార్మికులు పేర్కొన్నారు. వైఎస్సార్ వాహనమిత్ర పథకం కింద ఆటో, ట్యాక్సీ ఉన్న వారికి రెండో విడతగా రూ.10వేలు ఆర్ధిక సాయం అందించనున్నారు. 2,62,493 మంది లబ్దిదారులకు నేరుగా రూ.10వేల చొప్పున జమ చేయనున్నారు.
చదవండి:
తాగి వాహనాలు నడపొద్దు: సీఎం జగన్ విజ్ఞప్తి
‘వైఎస్సార్ వాహన మిత్ర’ రెండో విడత ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment