సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో పర్యటిస్తున్నారు. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు సీఆర్‌రెడ్డి డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన హెలీపాడ్‌కు హెలికాప్టర్ ద్వారా అక్కడకు చేరుకున్నారు. అక్కడ నుంచి ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని, ఆస్పత్రి ఆవరణలో వైద్య కళాశాలకు ఫౌండేషన్ స్టోన్ వేస్తారు. అనంతరం ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ పరిశీలిస్తారు. ఆ తర్వాత వైఎస్సార్ వాహన మిత్ర పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. మంజూరు పత్రాలు అందించి లబ్ధిదారులతో మాట్లాడతారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment