ఇది మీ అందరి ప్రభుత్వం: సీఎం జగన్‌ | YSR Vahana Mitra Scheme: CM Jagan Vijayawada Tour Updates | Sakshi
Sakshi News home page

ఇది మీ అందరి ప్రభుత్వం: సీఎం జగన్‌

Published Fri, Sep 29 2023 10:24 AM | Last Updated on Fri, Sep 29 2023 4:32 PM

Ysr Vahana Mitra: Cm Jagan Vijayawada Tour Updates - Sakshi

వైఎస్సార్‌ వాహన మిత్ర ఐదో విడత ఆర్థిక సా­యాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం విడుదల చేశారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. విద్యాధరపురం స్టేడియంకు చేరుకున్న సీఎం.. అక్కడ ఏర్పా­టు చేసిన వేదికపై బటన్‌ నొక్కి వైఎస్సార్‌ వాహనమిత్ర లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేశారు.

ఆటోడ్రైవర్లు అందించిన ఖాకీ చొక్కా ధరించిన సీఎం జగన్‌.. ప్రసంగం ప్రారంభించారు
బతుకు బండి లాగడానికి ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల కోసమే ఈ పథకం: సీఎం జగన్‌
వాహనం ఇన్యూరెన్స్‌, ఇతర ఖర్చుల కోసమే వైఎస్సార్‌ వాహన మిత్ర
ఆటో,ట్యాక్సీ డ్రైవర్లకు అండగా నిలిచేందుకే ఈ పథకం
ఇవాళ రూ.276 కోట్ల రూపాయలు జమ చేస్తున్నాం
వైఎస్సార్‌ వాహన మిత్రతో ఒక్కొక్కరికీ రూ.50 వేలు లబ్ది జరుగుతోంది
వైఎస్సార్‌ వాహన మిత్ర పథకం అమలు చేస్తున్నందుకు గర్వపడుతున్నా
ఇది జగనన్న ప్రభుత్వం కాదు.. ఇది మీ అందరి ప్రభుత్వం: సీఎం జగన్‌

మీ వాహనాలకు ఇన్స్యూరెన్స్‌, ఫిట్‌నెస్‌ సర్టిఫికేట్లు ఉంచుకోండి: సీఎం జగన్‌
ఎంతోమంది ప్రయాణికులకు మీరు సేవలందిస్తున్నారు
జగనన్న సురక్ష ద్వారా అవసరమైన సర్టిఫికేట్లు ఇంటికే అందిస్తున్నాం
పథకాలన్నీ అత్యంత పారదర్శకంగా అమలు చేస్తున్నాం
అవినీతికి తావులేకుండా పథకాలను అందిస్తున్నాం
వలంటీర్‌ వ్యవస్థతో పాలనను ప్రజలకు చేరువ చేశాం
అర్‌బీకేలతో రైతులకు అండగా నిలిచాం
పాదయాత్రలో మీ అందరి కష్టాలు చూశా
మీ సమస్యలకు పరిష్కారంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం
రైతన్నకు రూ.30,985 కోట్లు వైఎస్సార్‌ రైతు భరోసా సాయం
మత్స్యకార కుటుంబాలకు అండగా నిలిచాం
వాయిస్‌ ఆఫ్‌ వాయిస్‌లెస్‌ అంటే పేదల గొంతుకై నిలబడిన ప్రభుత్వం

చిరు వ్యాపారులకు రూ.2,956 కోట్లు సాయం అందించాం:  సీఎం జగన్‌
పేదల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం మనది
వైఎస్సార్‌ కాపునేస్తంతో రూ.2,029 కోట్లు సాయం అందించాం
వైఎస్సార్‌ ఈబీసీ నేస్తంతో రూ.1257 సాయం అందించాం
గత పాలకులకు మనసు లేదు
నిరుపేదల వైపు నిలబడిన ప్రభుత్వానికీ.. నిరుపేదలను వంచించిన గత ప్రభుత్వానికీ మధ్య యుద్ధం
మేనిఫెస్టోలో చెప్పిన ప్రతీ హామీని అమలు చేశాం
ఎన్నికల మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం

త్వరలో కురుక్షేత్ర యుద్ధం జరగబోతోంది: సీఎం జగన్‌
లంచం, వివక్ష లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేశాం
ఫైబర్‌ గ్రిడ్‌ స్కామ్‌, స్కిల్‌ స్కామ్‌, అసైన్డ్‌ భూముల స్కామ్‌, అమరావతి పేరుతో స్కాములు చేసిన గత ప్రభుత్వంతో యుద్ధం
గతంలోనూ ఇదే బడ్జెట్‌, మారిందల్లా సీఎం ఒక్కడే
గతంలో ఎందుకు ఈ పథకాలు ఇవ్వలేకపోయారు?
దోచుకోవడానికి వాళ్లకు అధికారం కావాలి
దోచుకున్నది పంచుకునేందుకే వాళ్లకు అధికారం కావాలి
వాళ్లకు మాదిగా నాకు గజ దొంగల ముఠా తోడుగా లేదు
దోచుకుని పంచుకుని తినుకోవడం నా విధానం కాదు

వైఎస్సార్‌ వాహన మిత్రతో మాకెంతో మేలు జరిగింది: లబ్ధిదారులు
గత ప్రభుత్వం ఆటో డ్రైవర్లను పట్టించుకోలేదు
ఆటో ఇన్య్సూరెన్స్‌ కోసం గతంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాం
సీఎం జగన్‌ ఇచ్చిన భరోసాతో గౌరవంగా బతుకుతున్నాం
నేను విన్నాను.. నేను ఉన్నానంటూ జగన్‌ ఆదుకున్నారు
పథకాలను అత్యంత పారదర్శకంగా అమలు చేస్తున్నారు
వలంటీర్‌ వ్యవస్థతో ప్రతీ కుటుంబానికి మేలు జరిగింది
కరోనా క్లిష్ట సమయంలోనూ వలంటీర్లు మాకు సేవలందించారు

అభివృద్దికి సీఎం జగన్‌ ట్రేడ్‌మార్క్‌: మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌
గత ప్రభుత్వం ఏ వర్గాన్నీ పట్టించుకోలేదు
ప్రజలకు ఏం కావాలో అదే సీఎం జగన్‌ అమలు చేస్తున్నారు
విజయవాడ అభివృద్ధికి సీఎం జగన్‌ అనేక నిధులు ఇచ్చారు
సీఎం జగన్‌ ఆధ్వర్యంలోనే విజయవాడ అభివృద్ధి

భారీగా హాజరైన వాహనమిత్ర లబ్ధిదారులు
వైఎస్సార్‌ విగ్రహానికి నివాళులు అర్పించిన సీఎం జగన్‌
సభా ప్రాంగణానికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్
విజయవాడ చేరుకున్న సీఎం జగన్‌
కాసేపట్లో వైఎస్సార్‌ వాహన మిత్ర నిధులు విడుదల చేయనున్న సీఎం

విజయవాడ బయలేర్దిన సీఎం వైఎస్‌ జగన్‌
కాసేపట్లో వైఎస్సార్‌ వాహన మిత్ర నిధులు విడుదల చేయనున్న సీఎం

కాసేపట్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి విద్యాధరపురం స్టేడియంకు చేరుకొంటారు. అక్కడ ఏర్పా­టు చేసిన వేదికపై బటన్‌ నొక్కి వైఎస్సార్‌ వాహనమిత్ర లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

సొంత వాహనంతో స్వయం ఉపాధి పొందుతున్న ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌ డ్రైవర్లు,  ఎండీయూ ఆపరేటర్లకు అండగా నిలిచేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్‌ వాహన మిత్ర పథకాన్ని ప్రవేశపెట్టారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా ప్రతి లబ్ధిదారుకు ఏటా రూ.10 వేలు ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు.

ఇప్ప­టి­వరకు నాలుగు విడతల సా­యాన్ని అందించిన సీఎం వైఎస్‌ జగన్‌.. వరుసగా ఐదో విడత ఆర్థిక సా­యాన్ని శుక్రవారం అందించనున్నారు.

విజయవాడ నగరం విద్యాధరపురంలో నిర్వహించే కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌ బటన్‌ నొక్కి లబ్ధిదారుల బ్యాంక్‌ ఖాతాల్లో నేరుగా నగదును జమ చేయనున్నారు. 2023–24 సంవత్సరానికి 2,75,931 మంది లబ్ధిదా­రులకు ఒక్కొక్కరికి రూ. 10 వేల చొప్పున రూ. 275.93 కోట్ల ఆర్థిక సాయం అందజేయనున్నారు. 

దీనితో కలిపి వైఎస్సార్‌ వాహన మిత్ర పథకం లబ్ధిదారులకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఇప్పటివరకు రూ.1,301.89 కోట్లు అందించినట్లు అవుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement