ఆర్బీఐకి వెల్లడించిన చంద్రబాబు ప్రభుత్వం
ఎల్లో మీడియాకు ప్రతి మంగళవారం బాబు అప్పులు కనిపించడం లేదా?
లేక ఈ అప్పులే సంపద సృష్టిలా కనిపిస్తోందా?
గతంలో వైఎస్ జగన్ సర్కార్‌పై ప్రతి మంగళవారం అప్పు అంటూ విషం కక్కిన ఎల్లో మీడియా
ఇప్పుడు బాబు అంటే ఇష్టం కాబట్టి అప్పు ఊసెత్తని వైనం
ఈ నెల 25న రూ.2 వేల కోట్లు, వచ్చే నెల 2న రూ.5 వేల కోట్ల అప్పు
సాక్షి, అమరావతి: ప్రతి మంగళవారం అప్పు చేయందే గడవదంటూ ఇన్నాళ్లూ వైఎస్ జగన్ సర్కారుపై రాసిందే పదే పదే రాస్తూ ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఎల్లో మీడియా విషం కక్కాయి. ఇప్పుడు చంద్రబాబు సర్కారు ప్రతీ మంగళవారం అప్పు చేస్తున్నా ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియాకు కనిపించడం లేదా? అని అధికార వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. బాబు సర్కారు ప్రతి మంగళవారం చేస్తున్న అప్పులు ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఎల్లో మీడియాకు సంపద సృష్టిస్తున్నట్లు కనిపిస్తోందా.. అంటూ ఎద్దేవా చేస్తున్నారు.
దేశంలోని అన్ని రాష్ట్రాలు సెక్యురిటీల విక్రయం ద్వారా అప్పులు చేయడానికి వెసులు బాటు కల్పిస్తూ ప్రతి మూడు నెలలకు ఆర్‌బీఐ వేలం వేసే తేదీలను ముందుగానే ప్రకటిస్తుంది. ఆయా తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత మేర అప్పు చేస్తాయో.. ఎన్ని సంవత్సరాల కాల వ్యవధిలో ఆ అప్పు తీరుస్తాయో ఆర్‌బీఐకి తెలియజేస్తాయి. అదే తరహాలో గత వైఎస్ జగన్ సర్కారు పరిమితికి లోబడి అప్పులు చేస్తే.. ప్రతి మంగళవారం అప్పు అంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఎల్లో మీడియా నిత్యం దు్రష్పచారం చేస్తూ కథనాలు వండి వారుస్తూ నానా యాగీ చేశాయి.
ఇప్పుడు చంద్రబాబు సర్కారు 20 రోజుల వ్యవధిలోనే రూ.7000 కోట్లు అప్పు చేసినా.. అదీ ప్రతి మంగళవారం అప్పు చేస్తున్నా ఈనాడు, ఆంద్రజ్యోతి తదితర ఎల్లో మీడియాకు కనిపించడం లేదు. దాని గురించి ఒక్క ముక్క రాయడం లేదు. అంటే తమకు ఇషు్టడైన చంద్రబాబు అధికారంలో ఉన్నందున, ఎన్ని అప్పులు చేసినా.. ఆ పత్రికలకు సంపద సృష్టిలా కనిపిస్తుందేమోనని ఉన్నతాధికారి ఒకరు ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ అంటే ఇష్టం లేనందున పరిమితికి లోబడి అప్పులు తెచ్చినా సరే ప్రతి మంగళవారం అప్పు చేయనిదే గడవదంటూ పెద్ద నేరం చేసినట్లు నిత్యం ఆ పత్రికలు కథనాలు రాసినట్లు ఇప్పుడు స్పష్టం అవుతోందని ఆ అధికారి విశ్లేషించారు.
సంపద సృష్టి ఏమైందో!
వైఎస్ జగన్ సర్కారు అప్పులు చేసి రాష్ట్రాన్ని శ్రీలంకలా మార్చేశారంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఎల్లో మీడియాతో పాటు చంద్రబాబు, పురందేశ్వరి, పవన్ కళ్యాణ్‌లు విషం కక్కారు. చంద్రబాబు అయితే ఒక అడుగు ముందుకు వేసి అప్పులు చేయడం కాదు.. సంపద సృష్టిస్తానని, ఆ సంపద ఎలా సృష్టించాలో తనకే తెలుసంటూ ఎన్నికల ముందు ప్రచారం చేశారు. ఇంత గట్టిగా బల్లగుద్ది చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు ప్రతి మంగళవారం అప్పులు చేస్తామంటూ ఆర్‌బీఐకి స్పష్టం చేసింది.
ఇదే సందర్భంలో ప్రతి మంగళవారం అప్పులతో పాటు ఎంత సంపద సృష్టిస్తారో కూడా చెబితే బాగుంటుందని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఈ నెల 25వ తేదీన సెక్యురిటీల వేలం ద్వారా రూ.2,000 కోట్లు అప్పు చేసిన చంద్రబాబు సర్కారు.. వచ్చే నెల 2వ తేదీన మంగళవారం మరో రూ.5,000 కోట్లు అప్పు చేస్తోంది. వచ్చే నెల 2వ తేదీన రూ.1,000 కోట్లు తమ్మిది సంవత్సరాల కాల వ్యవధికి, మరో రూ.1,000 కోట్లు 12 ఏళ్ల కాల వ్యవధికి, మరో రూ.1,000 కోట్లు 17 ఏళ్ల కాల వ్యవధికి, ఇంకో రూ.1,000 కోట్లు 21 ఏళ్ల కాల వ్యవధికి, మరో రూ.1,000 కోట్లు 24 ఏళ్ల కాల వ్యవధికి సెక్యురిటీల విక్రయం ద్వారా అప్పు చేయనుంది. ఆ తర్వాత మంగళవారం కూడా అప్పు చేయనున్నట్లు చంద్రబాబు సర్కారు ఆర్‌బీఐకి తెలియజేసింది.
Comments
Please login to add a commentAdd a comment