
సాక్షి, అమరావతి: వేతనాలు పెంచాలని వేడుకున్న అంగన్‌వాడీ వర్కర్లు, ఆయాలను గుర్రాలతో తొక్కించి, లాఠీలతో హింసించిన చంద్రబాబు నిరంకుశ పాలనను ఎవరూ మరచిపోలేరు. రాష్ట్ర విభజన అనంతరం ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడూ ఆయన అంగన్‌వాడీలను పట్టించుకున్న పాపాన పోలేదు. ఎన్నికలకు ఆర్నెల్ల ముందు అరకొరగా వేతనాల పెంపు పేరుతో మభ్యపుచ్చే యత్నాలు ఫలించలేదు.
సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వేతనాలు పెంపు, స్మార్ట్‌ఫోన్లు, అంగన్‌వాడీ వర్కర్లకు గ్రేడ్–2 సూపర్‌వైజర్లుగా పదోన్నతులు, అడగకుండానే పదోన్నతుల్లో వయో పరిమితి పెంపు లాంటి ప్రధాన నిర్ణయాలను తీసుకుంది. వాస్తవాలు ఇలా ఉండగా టీడీపీ అనుకూల మీడియా వక్రీకరిస్తూ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది.
దేశంలోనే ఏపీ బెస్ట్
అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ, వర్కర్లు, ఆయాలకు వేతనాలు పెంపు వంటి పలు అంశాల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమం. అంగన్‌వాడీ వర్కర్లకు, హెల్పర్లకు అత్యధికంగా జీతాలు చెల్లిస్తున్న టాప్ ఐదు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. అంగన్‌వాడీలను మరింత బలోపేతం చేశాం. అంగన్‌వాడీలు, ప్రభుత్వ బడుల్లో బలహీనవర్గాలకు చెందిన పిల్లలే అధికంగా ఉంటారు.
వారికి తోడుగా నిలుస్తూ సీఎం జగన్ ఎçప్పటికప్పుడు ప్రత్యేక శ్రద్ధతో చర్యలు చేపడుతున్నారు. రాష్ట్రంలో 55,607 అంగన్‌వాడీ కేంద్రాల్లో వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్‌తో ఆర్నెల్ల పసి బిడ్డల నుంచి ఆరేళ్ల పిల్లల వరకు, గర్భిణులు, బాలింతలకు పోషకాహారాన్ని అందించి బలమైన సమాజానికి ఊతమిస్తున్నారు.
– ఎ.సిరి, మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్
► అంగన్‌వాడీ వర్కర్లకు ఎన్నికలకు కొద్దిగా ముందు వరకు రూ.7 వేలు మాత్రమే వేతనాలు చెల్లించగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాగానే రూ.11,500కి పెంచింది. 2019 జూలై నుంచి పెంచిన జీతాలను చెల్లించింది.
► అంగన్‌వాడీ హెల్పర్లకు ఎన్నికలకు కాస్త ముందు వరకూ రూ.4,500 మాత్రమే వేతనాలు చెల్లించగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక రూ.7 వేలకు పెంచింది. 2019 జూలై నుంచి పెంచిన జీతాలను చెల్లిస్తోంది.
► సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో అంగన్‌వాడీ వర్కర్లకు పదోన్నతులు కల్పించారు. ఆ పదోన్నతుల ద్వారా 560 గ్రేడ్–2 సూపర్ వైజర్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. సూపర్‌వైజర్ పోస్టుల పరీక్షలకు వయో పరిమితిని 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచుతూ ఈ ప్రభుత్వం జీవో ఇచ్చింది. సీఎం వైఎస్ జగన్ పెద్ద మనసు కారణంగా తొమ్మిదేళ్లుగా ప్రమోషన్ల కోసం నిరీక్షిస్తున్న వారికి వయోపరిమితి పెంపు ఎంతో ఉపయోగపడింది. ఏళ్ల తరబడి డిమాండ్ చేస్తున్న పదోన్నతుల అంశాన్ని చంద్రబాబు ఐదేళ్ల పాలనలో కనీసం పట్టించుకోలేదు.
► అంగన్‌వాడీ వర్కర్లు, ఆయాలు, సూపర్‌వైజర్లు విధులను సజావుగా నిర్వహించడం, అత్యుత్తమ సేవలను అందించేందుకు ప్రభుత్వం టెక్నాలజీని వినియోగించుకుంటోంది. దీనికోసం వారికి స్మార్ట్‌ఫోన్‌లు అందించింది. 56,984 స్మార్ట్ ఫోన్ల కొనుగోలుకు రూ. 68.61 కోట్లను ప్రభుత్వం వెచ్చించింది.
► అంగన్‌వాడీల నిర్వహణలో భాగంగా వంట చెరకు, కూరగాయలు, రవాణా ఖర్చుల నిమిత్తం మార్చి వరకు బడ్జెట్ విడుదల చేసింది.
► మొత్తం మూడు దశల్లో నాడు – నేడు ద్వారా అంగన్‌వాడీ కేంద్రాల భవనాల అభివృద్ధి కోసం దాదాపు రూ.1,350 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేశారు.
► అంగన్‌వాడీల సమర్ధత పెంచేందుకు అన్ని రకాల శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఉత్తమ భవిష్యత్తు ఉన్న చిన్నారులను తీర్చిదిద్దడంలో వారి భాగస్వామ్యాన్ని
క్రియాశీలకం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment