మా పిల్లల చదువులపై కుట్రలొద్దు బాబూ | Parents says English medium essential for future of students | Sakshi
Sakshi News home page

మా పిల్లల చదువులపై కుట్రలొద్దు బాబూ

Published Thu, May 9 2024 5:25 AM | Last Updated on Thu, May 9 2024 5:27 AM

Parents says English medium essential for future of students

పిల్లల ఉన్నత భవిష్యత్‌కు ఇంగ్లిష్‌ మీడియం తప్పనిసరి అంటున్న విద్యార్థుల తల్లిదండ్రులురాష్ట్రంలోని 15,784 ప్రైవేటు స్కూల్స్‌లోనూ ఇంగ్లిష్‌లోనే బోధన  

వీటికి లేని భాషాభిమానం ప్రభుత్వ స్కూళ్లకే వచ్చిందా అని నిలదీత 

ఇప్పుడు పిల్లలకు ఇంగ్లిష్‌ చదువులు అందించలేకపోతే భవిష్యత్‌ అంధకారమేనని ఆందోళన 

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సంస్కరణలను స్వాగతిస్తున్న తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు  

ఇంగ్లిష్‌లోనే పరీక్షలు రాస్తున్న 93% పైగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 

కేంద్రం సర్వేలోనూ 90 శాతం పైగా ఇంగ్లిష్‌ మాధ్యమాన్నే కోరుకున్న వైనం

తాము ఇంగ్లిష్‌ చదువుల్లేకే ఎదగలేకపోయామని ఆవేదన

సాక్షి, అమరావతి: పేదింటి పిల్లలు ఇంగ్లిష్‌ మీడియంలో చదువుకుని తమ పెత్తందారుల పిల్లలకు ఎక్కడ పోటీకు వస్తారోనని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం ఎత్తేయడానికి చంద్రబాబు కుట్రలు పన్నుతుండటంపై విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. పిల్లలకు ఉన్నత భవిష్యత్‌ దక్కాలంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం చదువులు ఉండాల్సిందేనని వారంతా డిమాండ్‌ చేస్తున్నారు. తాము ఇంగ్లిష్‌ చదువుల్లేక జీవితంలో ఎదగలేకపోయామని.. తమ పిల్లలకు ఇలాంటి దుస్థితి తలెత్తకూడదని కోరుకుంటున్నారు. 

సీఎం వైఎస్‌ జగన్‌ తమ పిల్లలకు మేనమామలా ఉంటూ అనేక విప్లవాత్మక సంస్కరణలు, పథకాలు ప్రవేశపెట్టి అత్యుత్తమ విద్యను అందిస్తున్నారని ఘంటాపథంగా చెబుతున్నారు. రాష్ట్రంలోని 15,784 ప్రైవేటు స్కూల్స్‌లోనూ ఇంగ్లిష్‌లోనే బోధన ఉందని గుర్తు చేస్తున్నారు. వాటికి లేని తెలుగు భాషాభిమానం ప్రభుత్వ స్కూళ్ల విషయంలోనే వచ్చిందా.. అంటూ నిలదీస్తున్నారు. తమ పిల్లలకు ఇప్పుడు ఇంగ్లిష్‌ చదువులు అందకపోతే వారి జీవితం అంధకారమైనట్టేనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు తన మేనిఫెస్టోలో ‘కేజీ టు పీజీ సిలబస్‌ రివ్యూ’ అనే అంశాన్ని చేర్చడం వెనుక ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియంను ఎత్తేసే కుట్ర ఉందని ఆరోపిస్తున్నారు.  

నిరుపేదల పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని వారికి సీఎం వైఎస్‌ జగన్‌ ఉత్తమ బోధన, ఇంగ్లిష్‌ మీడియం చదువులను ఉచితంగా అందిస్తుంటే చంద్రబాబు కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని మండిపడుతున్నారు. పేద పిల్లలకు ఇంగ్లిష్‌ మీడియం బోధిస్తే మాతృభాష మరుగున పడిపోతుందంటూ మొసలికన్నీరు కారుస్తున్నారని ధ్వజమెత్తుతున్నారు.   

ఉన్నత విద్యకు ఇంగ్లిష్‌ తప్పనిసరి  
పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, మెడిసిన్‌ వంటి కోర్సులు చదవాలంటే ఇంగ్లిష్‌పై గట్టి పట్టు ఉంటే తప్ప సాధ్యం కాదు. పాఠశాల స్థాయిలో ఇంగ్లిష్‌ మీడియం లేనివారు ఉన్నత విద్యలో వెనుకబడుతున్నారు. మరికొందరు అర్థం చేసుకోలేక డ్రాపవుట్‌ కావడమో లేదా సాధారణ డిగ్రీ కోర్సులకు మారిపోవడమో చేస్తున్నారు. వీరిలో ప్రతిభ ఉన్నా ఇంగ్లిష్‌ భాషపై పట్టులేకపోవడంతో వెనకడుగు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో పాఠశాల స్థాయిలో ఇంగ్లిష్‌ మీడియం చదువుతున్న విద్యార్థులు ఉన్నత విద్యలోనూ అద్భుతంగా రాణిస్తారని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. 

గత చంద్రబాబు ప్రభుత్వం కార్పొరేట్‌ పాఠశాలలకు ఇచ్చిన ప్రాధాన్యం ప్రభుత్వ పాఠశాలలకు ఇవ్వకపోవడంతో ప్రభుత్వ విద్యా వ్యవస్థ అస్తవ్యస్తమైంది. దీంతో 2019లో అధికారంలోకి వచ్చాక వైఎస్‌ జగన్‌ సర్కారు ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. 2020లో రాష్ట్రవ్యాప్తంగా తల్లిదండ్రుల అభిప్రాయాలు సేకరించగా.. 97 శాతం మంది ఇంగ్లిష్‌ మీడియం బోధన తప్పనిసరిగా ప్రవేశపెట్టాలని విజ్ఞప్తి చేశారు. దీంతో ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియంను 2020–21 విద్యా సంవత్సరంలో ప్రవేశపెట్టింది. 

విద్యార్థుల్లో ఇంగ్లిష్‌ భాషా నైపుణ్యాన్ని పెంచేందుకు ద్విభాషా పాఠ్యపుస్తకాలు, డిక్షనరీలను కూడా అందించింది. ఇటీవల ముగిసిన పరీక్షలను దాదాపు 93 శాతం పైగా విద్యార్థులు ఇంగ్లి‹Ùలోనే రాశారు. పదో తరగతిలో ఇంగ్లిష్‌ మీడియం అమలు చేయకున్నా 2.23 లక్షల మంది విద్యార్థులు ఇందులోనే పరీక్షలు రాసిన సంగతి తెలిసిందే. వీరిలో 1.96 లక్షల మందికి పైగా ఉత్తీర్ణత సాధించడం విశేషం. దీన్ని బట్టి ఇంగ్లిష్‌ బోధనను ఎంత బలంగా కోరుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాది జనవరిలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన నేషనల్‌ అచీవ్‌మెంట్‌ సర్వేలోనూ 90 శాతం పైగా ఇంగ్లిష్‌ మీడియం చదువులనే కోరుకున్నారు.  

ఇంగ్లిష్‌ మీడియం లేకపోతే ఉద్యోగాలు ఎలా? 
సరైన ఇంగ్లిష్‌ చదువులు లేక మేము ఇబ్బందులు పడుతున్నాం. దాన్ని అందకుండా చేస్తే పిల్లలు పెద్దయ్యాక ఎలా బతుకుతారు? ఉద్యోగాలు ఎలా వస్తాయి? జగన్‌ ప్రభుత్వం ఉచితంగానే ఇంగ్లిష్‌ మీడియం బోధన అందిస్తోంది. అమ్మఒడి కింద ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయం పిల్లల చదువులకు ఉపయోగపడుతోంది. మా పిల్లలను ఇంగ్లిష్‌ మీడియంలోనే చేర్పించాం. ఎల్రక్టీíÙయన్‌గా కుటుంబాన్ని పోషిస్తున్న నాకు పిల్లల్ని ప్రైవేట్‌ స్కూల్లో చదివించడం ఆర్థికంగా భారమే.       
– షేక్‌ బాజీ, నజ్మా, గుంటూరు  

ఇంగ్లిష్‌ మీడియం పేదలకు వరం 
కూలి పనులు చేసుకుంటే తప్ప జీవనం గడవని మాలాంటి కుటుంబాలకు పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చేర్చే స్తోమత లేదు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం చదువులు చెప్పించడం మాలాంటి పేదలకు వరం. మా ఇద్దరు పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లోనే ఇంగ్లిష్‌లో మీడియంలో చదువుకుంటున్నారు. ఇప్పుడే పేద విద్యార్థులకు మంచి జరుగుతోంది. కార్పొరేట్‌ పాఠశాలలకు మించి చదువు చెబుతున్నారు. కొంతమంది నాయకులు ఇంగ్లిష్‌ మీడియం వద్దని చెబుతున్నారు. మరి వారి పిల్లలను ఏ పాఠశాలలో చదివిస్తున్నారో చెప్పాలి. వారికో న్యాయం, మాకో న్యాయమా?  
    – రాగోలు విజయలక్ష్మి, వంగర, విజయనగరం జిల్లా 

పిల్లల భవిష్యత్‌కు భరోసా 
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం బోధన ద్వారా పిల్లల భవిష్యత్‌కు భరోసా లభిస్తోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యావిధానంలో తీసుకొచ్చిన సంస్కరణలు అద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడు తల్లిదండ్రులు అందరూ తమ పిల్లల్ని ప్రభుత్వ బడుల్లో చదివించేందుకు ఆసక్తి చూపుతున్నారు. చంద్రబాబు ఇంగ్లిష్‌ విద్యాబోధనపై ఆరోపణలు చేయడం అన్యాయం. పేదల ఉత్తమ చదువులు అందడం ఆయనకు ఇష్టం లేదు. ఇంగిŠల్‌ష్‌ మీడియంను రద్దు చేయాలని చూస్తున్నారు. అదే జరిగితే ప్రభుత్వ స్కూళ్లు మూతపడే ప్రమాదముంది.     
– వాడపర్తి సుబ్బు, కోటనందూరు, కాకినాడ జిల్లా 

ఇప్పుడెన్నో సదుపాయాలు 
మా చిన్నప్పుడు ఇన్ని అవకాశాలను ఏ ప్రభుత్వం కల్పించలేదు. టీడీపీ ప్రభుత్వంలో అయితే పేద పిల్లలు ఇంగ్లిష్‌ మీడియం చదువులు దేవుడెరుగు.. అసలు స్కూళ్లనే పట్టించుకోలేదు. జగన్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పేద, మధ్య తరగతి పిల్లలకు ఉచితంగా ఇంగ్లిష్‌ మీడియంతో పాటు మరెన్నో సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు చంద్రబాబు ఇంగ్లిష్‌ మీడియం స్థానంలో తెలుగు మీడియం తీసుకువస్తామని చెప్పడం పిల్లల భవిష్యత్‌ను నాశనం చేయడానికే. మా పిల్లలను ఇంగ్లిష్‌ మీడియంలో చదివించకలేకపోయాను, కానీ జగన్‌ దయవల్ల మా మనవళ్లు, మనవరాళ్లను ఇంగ్లిష్‌ మీడియంలో చదివించుకుంటున్నాను.     
 – కర్రి రామ్‌గోపాల్, నర్సీపట్నం, అనకాపల్లి జిల్లా  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement