
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం ఒక చారిత్రాత్మకమని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నేటితో రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం ఆయన కాకినాడలో మీడియాతో మాట్లాడారు.
సాక్షి, కాకినాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం ఒక చారిత్రాత్మకమని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నేటితో రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం ఆయన కాకినాడలో మీడియాతో మాట్లాడారు. ఎన్ని కుట్రలు చేసినా.. కష్డాలు పెట్టిన సీఎం జగన్ ఒంటి చేత్తో పోరాడారని తెలిపారు. సీఎం జగన్ రెండేళ్ల పాలన.. ప్రజలలో సంతృప్తిని ఇచ్చిందని.. అందుకు ఉదాహరణే ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయం అని తెలిపారు.
తాను రైతు పక్షపాతినని ప్రకటించుకుని, గడిచిన రెండేళ్ల కాలంలో సంచలనాత్మకంగా వ్యవసాయ రంగానికి సీఎం జగన్ ఎంతో మేలు చేశారని పేర్కొన్నారు. రూ.83 వేల కోట్లు నేరుగా రైతులకు సాయం చేసిన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ రికార్డు సొంతం చేసుకున్నారని తెలిపారు. మ్యానిఫెస్టోలో చెప్పిన హమీలను 96 శాతం అమలు చేసి సీఎం జగన్ రికార్డు సృష్టించారని పేర్కొన్నారు. మాట ఇస్తే... చేస్తాడంతే అని ప్రజలు ఇవాళ సీఎం జగన్ గురించి చెప్పుకుంటున్నారని కన్నబాబు అన్నారు.
చదవండి: రెండేళ్ల పాలనపై పుస్తకాన్ని విడుదల చేసిన సీఎం జగన్
అభివృద్ధే లక్ష్యంగా సీఎం జగన్ ప్రభుత్వం: మంత్రి బొత్స