
రెండున్నర గంటల్లోనే లక్ష మార్కును అందుకున్న ‘2ఇయర్స్ ఫర్ వైఎస్ జగన్ అనే నేను’ హ్యాష్‌ట్యాగ్
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్ రెండేళ్ల పాలన సంబరాలు ఒక రోజు ముందుగానే మొదలయ్యాయి. ట్విట్టర్‌లో ‘2ఇయర్స్ ఫర్ వైఎస్ జగన్ అనే నేను’ హ్యాష్‌ట్యాగ్ శనివారం దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌లో మొదటి స్థానంలో నిలిచింది. ఈ ట్రెండింగ్ ఇదే స్థాయిలో కొనసాగుతోంది. ఈ హ్యాష్‌ట్యాగ్‌ను ట్విట్టర్‌లో క్రియేట్ చేసిన రెండున్నర గంటల్లోనే లక్ష మందికిపైగా ట్వీట్లు చేయడం విశేషం.
శనివారం రాత్రి పది గంటల సమయానికి ఈ హ్యాష్‌ట్యాగ్ దేశంలో ట్రెండింగ్‌లో మొదటి స్థానంలో నిలిచింది. ఇది సీఎం వైఎస్ జగన్‌కి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్‌ను తెలియచేస్తోందని టెకీలు పేర్కొంటున్నారు. గతంలో ఆయన పుట్టినరోజు సందర్భంగా సృష్టించిన హ్యాష్‌ట్యాగ్ కూడా భారీగా ట్రెండింగ్‌లో నిలిచింది. గతేడాది సీఎంగా మొదటి ఏడాది పూర్తి చేసుకున్నప్పుడు రూపొందించిన హ్యాష్‌ట్యాగ్‌ను 20 లక్షలకు మందికిపైగా ట్రెండింగ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment