
రాష్ట్రాభివృద్ధి కొనసాగాలంటే వైఎస్సార్‌సీపీనే అధికారంలోకి రావాలి
వైఎస్ జగన్ చరిష్మాను తట్టుకోలేని దుష్టశక్తుల కుట్రలను తిప్పి కొట్టాలి
హైదరాబాద్‌లో ‘మేమంతా సిద్ధం’ సభలో వక్తల పిలుపు
జై జగన్ నినాదాలతో మార్మోగిన కూకట్‌పల్లి పరిసరాలు
కూకట్‌పల్లి (హైదరాబాద్): ఏ నోట విన్నా అదే మాట.. ఏ నోట విన్నా అదే పాట.. జై జగన్.. జైజై జగన్.. కూకట్‌పల్లిలో ఆంధ్రప్రదేశ్ ఓటర్లు మేమంతా సిద్ధం పేరిట ఏర్పాటు చేసిన వైఎస్సార్ సీపీ అభిమానుల ఆత్మీయ సమ్మేళనం జగన్నినాదంతో పోటెత్తింది. జెండాలు జతకట్టడమే మీ ఎజెండా.. జనం గుండెల్లో గుడి కట్టడమే జగన్ ఎజెండా’ అంటూ యువత హోరెత్తించింది. కూకట్‌పల్లి, కుత్భుల్లాపూర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలోని పలు ప్రాంతాల్లో ఉన్న వేలాది మంది ఏపీ ఓటర్లు ఈ ఎన్నికల్లో మళ్లీ ఫ్యాన్ తడాఖా చూపిస్తామంటూ నినదించారు.
ఆదివారం ఎన్‌ఎకెఎన్‌ఆర్ గార్డెన్‌లో జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ప్రజాప్రతినిధులు పాల్గొని ప్రసంగించారు. ఏపీని అన్ని రంగాల్లో అగ్రగామిగా అభివృద్ధి చేసిన సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని విపక్షాలు రాజకీయంగా ఎదుర్కోలేకనే భౌతిక దాడులకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రం విడిపోయి కష్ట కాలంలో ఉన్న సమయంలో రూ.లక్షల కోట్లతో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు.
పేద విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియం చదువు కోసం ఏపీలోని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ. 54 వేల కోట్లను వెచ్చించిందని గుర్తుచేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని సమానంగా ముందుకు తీసుకెళ్లిన వైఎస్ జగన్ ప్రభుత్వానికి ప్రజలు నీరాజనాలు పలుకుతుంటే ఓ వైపు ఎల్లో మీడియా, మరో వైపు ప్రతిపక్షాలుగా చెప్పుకుంటున్న అన్ని పార్టీలు మల్టీ మాఫియాలా తయారయ్యాయని ధ్వజమెత్తారు.
అందరూ ఓట్లేయాలి
తిరుపతి ఎంపీ అభ్యర్థి గురుమూర్తి, ఎమ్మెల్యే అభ్యర్థులు రఘురామిరెడ్డి, అన్నాబత్తుని శివకుమార్, ఎమ్మెల్సీలు శివరామిరెడ్డి, కల్పలతతో పాటు ఈశ్వర్‌ప్రసాద్‌రెడ్డి, నేతలు కరుణాకర్‌రెడ్డి, ఎంఈవీప్రసాద్‌రెడ్డి, హనుమంతరెడ్డి తదితరులు ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్‌లో మాఫియా ముఠాలు ఎన్ని కుట్రలు పన్నినా వైఎస్సార్‌సీపీదే అంతిమ విజయమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రూ.15 లక్షల కోట్ల పెట్టుబడులతో అభివృద్ధి పనులు, పరిశ్రమలు వచ్చాయని, అవి సంపూర్ణంగా ఆంధ్ర ప్రజలకు అందాలంటే జగన్ మరోసారి సీఎం కావాల్సిందే అని వారు తెలిపారు.
ఇక్కడి కార్యకర్తలందరూ వారం రోజులు ముందుగానే తమ గ్రామాల్లో ఉన్న ఓటర్ల వివరాలను సేకరించుకుని వారితో ఓటు వేసే విధంగా కృషి చేయాలని సూచించారు. నిర్వాహకులు ఎస్వీ సుబ్రమణ్యం, బాణరాగవు సునీల్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డి, చంద్రారెడ్డి, విజయభాస్కరరెడ్డి, రఘురాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తొలుత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ చిత్రపటానికి, వైఎస్సార్ విగ్రహానికి పూలదండలు వేసి నివాళులరి్పంచారు.
Comments
Please login to add a commentAdd a comment