కూటమి సర్కార్‌ కుచ్చుటోపీ.. బాబు కొత్త డ్రామా: వైఎస్సార్‌సీపీ | YSRCP Questioned By CM Chandrababu About political Diversions | Sakshi
Sakshi News home page

కూటమి సర్కార్‌ కుచ్చుటోపీ.. బాబు కొత్త డ్రామా: వైఎస్సార్‌సీపీ

Published Thu, Oct 3 2024 4:29 PM | Last Updated on Thu, Oct 3 2024 4:29 PM

YSRCP Questioned By CM Chandrababu About political Diversions

సాక్షి, తాడేపల్లి: ఏపీలో పథకాల అమలును కూటమి సర్కార్‌ గాలికొదిలేసింది. నాలుగు నెలల్లో ఒక్క పథకం కూడా అమలు చేయకుండా.. గత ఐదేళ్లలో అందిన పథకాల్లో కోతలు విధిస్తోందని వైఎస్సార్‌సీపీ తెలిపింది. అలాగే, ఉచిత ఇసుక అంటూ చంద్రబాబు కుచ్చుటోపీ పెట్టాడని చెప్పుకొచ్చింది.

కూటమి సర్కార్‌ను ప్రశ్నిస్తూ వైఎస్సార్‌సీపీ ట్విట్టర్‌ వేదికగా.. నాలుగు నెలల్లోనే ఇసుకని సాంతం దోచేసిన తెలుగు తమ్ముళ్లు. వైఎస్సార్‌సీపీ హయాంలో నిండుగా కనిపించిన ఇసుక యార్డులన్నీ ఇప్పుడు ఖాళీగా దర్శనం ఇస్తున్నాయి. ఉచిత ఇసుక అంటూ.. చంద్రబాబు కుచ్చుటోపీ పెట్టాడు. ఇప్పుడు ఇసుక లేదంటే జనం ఉమ్మేస్తారని భయపడి.. ఆన్‌లైన్ బుకింగ్‌ పేరుతో కూటమి ప్రభుత్వం నాటకాలాడుతోంది.

 

👉అలాగే, పథకాల అమలు గాలికొదిలేసి.. కోతలతో సరిపెట్టిన చంద్రబాబు. నాలుగు నెలల్లో ఒక్క పథకం కూడా అమలు చేయకుండా.. గత ఐదేళ్లుగా అందిన పథకాలకి వరుసగా కోతలు పెడుతున్నాడు. వైఫల్యాలను ప్రశ్నిస్తారని భయపడి.. టాపిక్ డైవర్ట్‌ చేస్తూ బురద రాజకీయాలతో చంద్రబాబు సరిపెడుతున్నాడు.  
 


👉పెన్షన్ల విషయంలో కూడా పండుటాకులపై కక్ష సాధిస్తున్న చంద్రబాబు. పెన్షన్ పెంపు ముసుగేసి.. 100 రోజుల్లోనే లక్షా 50వేల మందికి కూటమి సర్కార్‌లో పెన్షన్ల కోత విధించారు. ఇదేంటని అడిగితే.. చిత్ర, విచిత్రమైన కారణాలు చెప్తున్న కూటమి నేతలు. అవ్వాతాతలపై ఎందుకు నీకు ఇంత పగ చంద్రబాబు?.

 

 

👉కూటమి చేతగానితనంతో బెజవాడ వరద బాధితులకి తప్పని తిప్పలు. టీడీపీకి అనుకూలమైన వారికే సాయం అందేలా పావులు కదిపిన తెలుగు తమ్ముళ్లు. అర్హత ఉండి కూడా.. సాయం కోసం కలెక్టరేట్ వద్ద పడిగాపులు కాస్తున్న వేలాది మంది బాధితులు. అస్తవ్యస్తంగా బాధితుల జాబితాతో చేతులెత్తేసిన అధికారులు.. ఇదేనా చంద్రబాబు నీ అనుభవం? అని ప్రశ్నించింది. 
 

ఇది కూడా చదవండి: తిరుమల జోలికి వెళ్లొద్దు.. చంద్రబాబుకు విజయసాయి వార్నింగ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement