![Ysrcp Mp Vijayasai Reddy Warns Chandrababu](/styles/webp/s3/article_images/2024/10/3/Ysrcp-Mp-Vijayasai-Reddy-Wa.jpg.webp?itok=3U5y6v_O)
సాక్షి, అమరావతి: తిరుమల జోలికి వెళ్లొద్దంటూ సీఎం చంద్రబాబును వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి హెచ్చరించారు. ‘‘మీ కుళ్లు రాజకీయాలకు దేవుడిని వాడుకోవద్దు. హిందువుల మనోభావాలు దెబ్బతీస్తే నాశనమైపోతారు’ అంటూ విజయసాయి ట్వీట్ చేశారు.
చంద్రబాబు! @ncbn,
“తిరుమల జోలికి వెళ్లొద్దు"
మీ కుళ్లురాజకీయాలకు దేవుడిని వాడుకోవద్దు.
హిందుమనోభావాలు దెబ్బతీస్తే నాశనమైపోతారు!https://t.co/mYi2pFSWFL— Vijayasai Reddy V (@VSReddy_MP) October 3, 2024
మరోవైపు, పురందేశ్వరిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలంటూ విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. ‘తిరుమల లడ్డూ ప్రసాదాల విషయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి కనీస ఇంగితజ్ఞానం లేకుండా అత్యున్నత న్యాయస్థానాన్ని, న్యాయమూర్తులను తప్పు పడుతూ వారి ప్రతిష్టకు భంగం కలిగించేలా అగౌరవపరుస్తూ చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధం. కోర్టు ధిక్కారం... ఆమెపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి.’ అని ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఇదీ చదవండి: నాలుగు నెలల్లోనే.. అన్నింటా విఫలం: వైఎస్ జగన్
‘పురందేశ్వరి మొత్తం మీద సుప్రీంకోర్టుదే తప్పు అని తేల్చారు. చంద్రబాబు రాజ్యాంగ పదవిలో ఉన్నాడు కాబట్టి ఆయన ఏదైనా అనొచ్చంట... ఏమమ్మా! మరి న్యాయవ్యవస్థ కూడా రాజ్యాంగ వ్యవస్థే కదా! తమరికి తెలియదా? అంత చిన్న విషయానికే న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేస్తారా? అని చిరాకు పడిపోయారు పురందేశ్వరి. ఆమెది భావాతీతమైన ఆవేదన అనుకోవాలి మరి.
కోర్టులు, దేవుడి కంటే చంద్రబాబే గొప్పవాడు అన్నట్లుంది పురందేశ్వరి వైఖరి. ఈ వందేళ్లలో తిరుమల ఆలయానికి నారా, నందమూరివారు చేసిన డ్యామేజీ మరి ఎవరూ చేయలేదు. ఇంకెన్ని ఘోరాలు చూడాలో గోవిందా... గోవిందా.. లడ్డూ ప్రసాదాల విషయంలో చంద్రబాబు హిందువుల మనోభావాలను దెబ్బతీయటమే కాకుండా మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారు.’ అని విజయసాయిరెడ్డి మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment