
సాక్షి, అమరావతి: సాంఘిక సంక్షేమశాఖ పరిధిలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేసిన ఆరు పథకాలకు టీడీపీ ప్రభుత్వం పేర్లు మార్చింది. ఈ మేరకు సాంఘిక సంకేమ శాఖ కార్యదర్శి కె.హర్షవర్థన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. స్కూల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్‌మెంట్‌గా ‘నాడు–నేడు’ డాష్ బోర్డు పేరు మార్పు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం ‘మనబడి నాడు–నేడు’ పేరుతో ప్రత్యేక విభాగాన్ని అందుబాటులోకి తెచ్చింది.]

ఈ పనుల పురోగతితో పాటు అన్ని అంశాలను పరిశీలించి తగు నిర్ణయం తీసుకునేందుకు ఓ ప్రత్యేక కమిషనర్‌ను కూడా నియమించింది. అయితే, ఇప్పటి వరకు పాఠశాల విద్యాశాఖలో ‘నాడు–నేడు’ పేరుతో ఉన్న వెబ్‌సైట్‌ను ‘స్కూల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్‌మెంట్’గా పేరు మార్చారు. ఈ విభాగంలో రాష్ట్రంలోని సుమారు 45 వేల ప్రభుత్వ పాఠశాలల పునర్ నిర్మాణంతో పాటు 11 రకాల సదుపాయాలను కల్పించే బృహత్తర కార్యక్రమాన్ని ఈ విభాగం చేపట్టింది.
Comments
Please login to add a commentAdd a comment