వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ మేలును ప్రజల్లోకి తీసుకెళ్లాలి: సజ్జల | Sajjala Ramakrishna Reddy About Ap Welfare Schemes | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ మేలును ప్రజల్లోకి తీసుకెళ్లాలి: సజ్జల

Published Wed, Jan 24 2024 3:08 PM | Last Updated on Sat, Feb 3 2024 9:46 PM

Sajjala Ramakrishna Reddy About Ap Welfare Schemes - Sakshi

సాక్షి, విజయవాడ: వైఎస్సార్ ఆశయాలు.. ఆలోచనలకు అనుగుణంగా పెట్టిన పార్టీ వైఎస్సార్‌సీపీ.. అణగారిన వర్గాలతో అసోసియేట్ అవ్వడమే ప్రధాన లక్ష్యమని ఏపీ ప్రభుత్వ  సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. బుధవారం ఆయన ఆంధ్రప్రదేశ్ ఎస్సీ,ఎస్టీ గెజిటెడ్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 2024-డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సీఎం జగన్‌.. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసి తన చిత్తశుద్ధి నిరూపించుకున్నారన్నారు.

‘‘పథకాలు, సంస్కరణల్లో సీఎం జగన్‌ బడుగు బలహీన వర్గాలకు పెద్ద పీట వేశారు. అణగారిన వర్గాలనుపైకి తీసుకువచ్చే ప్రక్రియలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల భాగస్వామ్యం కావాలి. గత ప్రభుత్వాలు వెనుకబడిన తరగతుల కోసం ఖర్చు చేసిందేమీ లేదు. సంపన్నులతో పోటీ పడే స్థాయికి అన్ని వర్గాలనూ తీర్చిదిద్దిన ఘనత సీఎం జగన్‌కే దక్కింది. సచివాలయ ఉద్యోగాల్లో 80 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీలకే దక్కాయి. మేనిఫెస్టోలో లేనివి కూడా సీఎం జగన్‌ అమలు చేశారు’’ అని సజ్జల పేర్కొన్నారు.

‘‘టీడీపీ హయాంలో పథకాలు కొందరికే దక్కేవి. సీఎం జగన్‌ అర్హులైన వారిని వెతికి మరీ ఇచ్చారు. ఈ నాలుగున్నరేళ్లలో జరిగినంత సంక్షేమం స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జరగలేదు. ఎన్నికలు రాబోతున్నాయ్‌. మీ భవిష్యత్తులు మారాలంటే.. మీరంతా ప్రభుత్వం చేస్తున్న మేలును ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఏ చిన్న తేడా జరిగినా పేదలకు జరుగుతున్న మంచి దూరమైపోతుంది. మీడియాను మేనేజ్‌ చేస్తే సరిపోతుందని కొన్ని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఏమీ జరగడం లేదని ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచికి.. అభివృద్ధికి పబ్లిసిటీ అవసరం లేదని సీఎం భావించారు’’ అని సజ్జల తెలిపారు.

ఇదీ చదవండి: భావితరాలకు అనుగుణంగా సీఎం జగన్‌ పాలన: సజ్జల

కొత్తగా రూపుదిద్దుకుంటున్న పోర్టులు రాష్ట్రం రూపురేఖలు మార్చేస్తాయి. 11 మెడికల్ కళాశాలల ద్వారా  దేశానికి కావాల్సిన వైద్యులను ఏపీ అందించబోతోంది. అంబేద్కర్‌కు హిమాలయాలంత విగ్రహం పెట్టినా సరిపోదు. అంతర్జాతీయ స్థాయిలో అంబేద్కర్ విగ్రహం, స్మృతివనం రూపుదిద్దుకుంది. అంబేద్కర్ విగ్రహం గొప్ప పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుకుంటుంది. అమెరికాలో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కనిపిస్తుంది. విజయవాడలో కొండ పై అమ్మవారు...కొండ కింద అంబేద్కర్ కనిపిస్తారు. దళితుల నుంచి మరింత మేధావులు రావాలనేదే సీఎం జగన్‌ ఆలోచన. ఆయన చేపట్టిన యజ్ఞంలో మీరంతా భాగస్వామ్యం కావాలని కోరుతున్నా’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement