సాక్షి, న్యూఢిల్లీ : ఈ ఏడాది నవంబర్‌లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తన విజయంపై అగ్ర దేశాధినేత డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత కార్పొరేట్ దిగ్గజాలతో మంగళవారం సాయంత్రం ట్రంప్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడతూ ఈ ఏడాది అధ్యక్ష ఎన్నికల్లో తాను విజయం సాధించని పక్షంలో అమెరికా ఈక్విటీ మార్కెట్లు కుప్పకూలుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. తాను అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందితే తమ మార్కెట్లు వేలకు వేల పాయింట్ల మేర పెరుగుతాయని, తాను ఓడితే అవి మీరెన్నడూ చూడని రీతిలో పేకమేడల్లా కూలిపోతాయని వ్యాఖ్యానించారు.
అమెరికాలో పెట్టుబడులు పెట్టాలని ట్రంప్ భారత కార్పొరేట్లను కోరారు. కార్పొరేట్లు, నూతన పెట్టుబడులకు నియంత్రణలు, పన్నులను తగ్గించామని చెప్పుకొచ్చారు. గతంలో ఒక్క హైవే ప్రాజెక్టు క్లియరెన్స్‌కు 20 ఏళ్ల సమయం పడితే తాము క్లియరెన్స్ ప్రక్రియను రెండేళ్లకు కుదించామని పేర్కొన్నారు. పారిశ్రామికదిగ్గజం ముఖేష్ అంబానీ సహా పలువురు కార్పొరేట్ దిగ్గజాలు ట్రంప్‌తో భేటీ అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment