తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు పడి 40 తులాల బంగారం, లక్ష రూపాయల నగదు ఎత్తుకెళ్లిన సంఘటన ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ మండలం కడతాల్‌లో శనివారం రాత్రి చోటుచేసుకుంది.
నిర్మల్ (ఆదిలాబాద్) : తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు పడి 40 తులాల బంగారం, లక్ష రూపాయల నగదు ఎత్తుకెళ్లిన సంఘటన ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ మండలం కడతాల్‌లో శనివారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రాచ నగేష్ ఇంటికి తాళం వేసి దసరా పండుగకు బంధువుల ఇంటికి వెళ్లాడు.
తిరిగి ఆదివారం ఉదయం ఇంటికి వచ్చిన నగేష్ తాళం పగులగొట్టి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రాథమిక దర్యాప్తు చేసి 40 తులాల బంగారం, రూ.1 లక్ష నగదు అపహరణకు గురైనట్లు తేల్చారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.