వృద్ధుడి దారుణ హత్య
Published Mon, Apr 3 2017 12:23 AM | Last Updated on Sat, Jul 6 2019 12:36 PM
పొలానికి వెళ్లి వస్తుండగా ఘటన
హంతకుల కోసం పోలీసుల గాలింపు
మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు
కొత్తపల్లి: మండలకేంద్రం కొత్తపల్లిలోని పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఓ వృద్ధుడు దారుణహత్యకు గురయ్యాడు. పొలం పనులకెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. హంతకులు ఎవరన్నది తెలియాల్సి ఉంది. వివరాలో్లకి వెళితే.. గ్రామానికి చెందిన తెలుగు పెద్దచిన్నయ్య(65) రైతు. ఇతడికి భార్య లలితమ్మతో పాటు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు సంతానం. మృతుడు ఆదివారం ఉదయం పొలం గట్ల వెంట ఉండే పొదలను కాల్చివేసేందుకు శివపురం పాత రస్తా పొలానికి వెళ్లాడు. పొలం గట్లు అంటించి తిరిగి ఇంటికి వస్తుండగా మార్గమధ్యంలో ఎవ్వరో గుర్తుతెలియని వ్యక్తులు గొడ్డలితో మొహాంపై దాడి చేసి అతికిరాతకంగా నరికి పరారయ్యారు.
అయితే అదే బాటలో పొలానికి వెళ్తున్న గ్రామస్తుడు తిక్కస్వామి రక్తపుమడుగులో పడి ఉన్న పెద్ద చిన్నయ్యను గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే వారు ఘటన స్థలానికి చేరుకుని కొనఊపిరితో ఉన్న అతడిని ఆత్మకూరుకు చికిత్స నిమిత్తం తరలించగా మార్గమధ్యంలో బాపురం వద్ద మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న ఆత్మకూరు సీఐ క్రిష్ణయ్య, పాములపాడు ఎస్‌ఐ సుధాకర్‌రెడ్డి కొత్తపల్లికి చేరుకుని సంఘటనపై ఆరా తీశారు. హంతకుల ఆచూకీని తెలుసుకునేందుకు కర్నూలు నుంచి డాగ్‌స్క్వాడ్‌ను పిలిపించి గాలింపు చర్యలు చేపట్టారు. డాగ్ మృతుడి ఇంటి వద్దకే చేరుకోవడం పలు అనుమానాలను రేకెత్తిస్తోంది.
మృతుడి కుమారుడు పెద్దలింగస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ క్రిష్ణయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హంతకులను త్వరలోనే పట్టుకుంటామని సీఐ చెప్పారు. అనంతరం మృతదేహాని్న ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు.
Advertisement
Advertisement