పంటకు నీళ్లు పెట్టేందుకు వెళ్లి..
Published Thu, Nov 3 2016 10:44 PM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
నరసరావుపేట రూరల్: కంది పంటకు నీరు పెట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు డ్రాప్‌లో మునిగి రైతు మృతిచెందిన సంఘటన రంగారెడ్డిపాలెంలో చోటుచేసుకుంది. మృతుని బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన యేరువ భారతరెడ్డి(55) ఎకరం కంది పంటను సాగుచేస్తున్నాడు. పెదనందిపాడు సాగర్‌కాలువలకు నీరు విడుదల చేయడంతో కంది పంటకు నీరు పెట్టేందుకు బుధవారం సాయంత్రం వెళ్ళాడు. డ్రాప్‌లో రాళ్ళు పెట్టేందుకు దిగి మునిగిపోయాడు. కూలీలు వచ్చి బయటకు తీయగా అప్పటికే భారతరెడ్డి మృతిచెందాడు. ఎమ్మెల్యే డా.గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గురువారం భారతరెడ్డి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీలో చురుగ్గా పనిచేసే భారతరెడ్డి మృతి తీరని లోటని డా.గోపిరెడ్డి అన్నారు. ఎమ్మెల్యే వెంట గ్రామ సర్పంచ్ దొండెటి అప్పిరెడ్డి, ఇన్‌చార్జ్ సర్పంచ్ నల్లగంగుల యజ్ణారెడ్డి, ఎంపీటీసీ పొతిరెడ్డి శివారెడ్డి, మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్మనబొయిన శంకరయాదవ్, మూరే రవీంద్రారెడ్డి తదితరులు ఉన్నారు.
రైతు దుర్మరణం
Advertisement