19,850 హెక్టార్లలో పంట నష్టం
19,850 హెక్టార్లలో పంట నష్టం
Published Wed, Sep 28 2016 7:54 PM | Last Updated on Mon, Sep 4 2017 3:24 PM
నివేదిక రూపొందించిన అధికారులు
కొరిటెపాడు (గుంటూరు): ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జిల్లా వ్యాప్తంగా 19,850 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. పల్నాడు ప్రాంతంలోని దాచేపల్లి, దుర్గి, నకరికల్లు, వెల్దుర్తి, బొల్లాపల్లి, బెల్లంకొండ, నాదెండ్ల, రెంటచింతల, మేడికొండూరు, గురజాల, ముప్పాళ్ల, పొన్నూరు, మాచర్ల, మేడికొండూరు తదితర మండలాల్లోనే నష్ట తీవ్రత అధికంగా ఉన్నట్లు వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు నిర్ధారించారు. సెప్టెంబరు నెలలో సాధారణ వర్షపాతం 125.2 మిల్లీ మీటర్లు ండగా, 245.2 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైంది. అంటే 96 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది. అధిక వర్షాల వల్ల పత్తి 10,734 హెక్టార్లు, మిరప 5 వేల హెక్టార్లు, వరి 3078 హెక్టార్లు, కంది 241 హెక్టార్లు, మినుము 726 హెక్టార్లు, కూరగాయలు 50 హెక్టార్లు, ఇతర పంటలు 71 హెక్టార్లులో పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపనున్నారు. మూడు రోజుల కిందట 37 వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమిక అంచనా రిపోర్టును వ్యవసాయ, ఉద్యానశాఖల అధికారులు ఉన్నతాధికారులకు నివేదించారు. అధికారులు పూర్తి స్థాయిలో సర్వే చేసి 19,850 హెక్టార్లలో రైతులు పంటలు నష్టపోయినట్లు అంచనా రూపొందించారు.
Advertisement