24 నుంచి పంట నష్టం సర్వే
Published Sat, Oct 22 2016 11:31 PM | Last Updated on Mon, Sep 4 2017 6:00 PM
కర్నూలు(అగ్రికల్చర్): ప్రభుత్వం ప్రకటించిన 36 కరువు మండలాల్లో ఈ నెల 24 నుంచి పంటనష్టం సర్వే మొదలయ్యే అవకాశం ఉంది. సర్వే కోసం గ్రామస్థాయి, మండల స్థాయిలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. గ్రామ స్థాయిలో వీఆర్‌ఓ, వ్యవసాయ విస్తరణ అధికారి సభ్యులుగా ఉంటారు. మండల స్థాయిలో తహసీల్దారు, మండల వ్యవసాయాధికారి సభ్యులుగా ఉంటారు. ఐదు ఎకరాలోపు భూములు కలిగిన రైతులు, ఐదు ఎకరాలు పైబడి భూముల ఉన్న రైతుల వివరాలను వేరువేరుగా నమోదు చేస్తారు. సర్వేలో భాగంగా రైతులు ఆధార్ నెంబరు లింక్ అయిన బ్యాంకు పాసు పుస్తకం జిరాక్స్ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. గ్రామం, సర్వే నెంబరు వానీగా పంట నష్టం సర్వే చేసేందుకు జిల్లా వ్యవసాయాధికారులు.. జిల్లా కలెక్టర్‌కు ఫైల్ పంపారు. కలెక్టర్ అమోదం వచ్చిన వెంటనే సర్వే మొదలు కానుందని అధికారులు తెలిపారు.
Advertisement