రైతు ఆత్మహత్య | farmer suicide | Sakshi
Sakshi News home page

రైతు ఆత్మహత్య

Dec 12 2016 12:02 AM | Updated on Oct 1 2018 2:44 PM

చేసిన అప్పులు తీర్చలేక, ఎండిపోయిన పొలాన్ని చూసి తట్టుకోలేక ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు.

కర్నూలు(హాస్పిటల్‌): చేసిన అప్పులు తీర్చలేక, ఎండిపోయిన పొలాన్ని చూసి తట్టుకోలేక ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కల్లూరు మండలం తడకనపల్లి గ్రామానికి చెందిన నడిపి సుబ్బన్న కుమారుడు వెలుగుల కృష్ణ(36) తనకున్న నాలుగు ఎకరాల పొలంలో ఆముదాలు, కంది పంటలు వేశాడు. నెలరోజులకు పైగా వర్షాలు లేకపోవడంతో వేసిన పంట ఎండిపోయింది. దీనికితోడు చేసిన అప్పులు రూ.5లక్షలు దాటాయి.  ఈ క్రమంలో ఫైనాన్స్‌లో ఆటో తీసుకుని నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మరోవైపు అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ఆయన ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయనకు భార్య దస్తగిరమ్మ, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. ఉలిందకొండ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement