స్కూటర్‌తో దంతె..!
స్కూటర్‌తో దంతె పడుతున్న ఈ చిత్రం మంత్రాలయం మండలం కల్లుదేవకుంట గ్రామ సమీపంలో గురువారం కనిపించింది. గ్రామానికి చెందిన తిక్కయ్య, మాణిక్యమ్మల కుమారుడు శివ.. బీఏ పూర్తి చేసి ఎమ్మిగనూరులో ఆర్‌ఎంపీగా వైద్య సేవలందిస్తూన్నాడు. గ్రామ సమీపంలో 2.5 ఎకరాలు వాము పంటను సాగు చేయగా.. కలుపు మొక్కలు ఎక్కవగా పెరిగాయి. దీంతో తన ద్విచక్ర వాహనానికి దంతె కట్టి తల్లితండ్రులతో కలిసి పొలం పనులకు ససహకరిస్తున్నారు. ఈ దృశ్యాన్ని అటుగా వెళ్లే వారు ఆసక్తిగా తిలకించారు.
-మంత్రాలయం రూరల్