
ప్రముఖ నటుడు, సూపర్‌స్టార్ కృష్ణ (79) మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆదివారం అర్ధరాత్రి గుండెపోటుతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటే ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందతూ మంగళవారం తెల్లవారు జామును కన్నుమూశారు. ఆయన మృతితో ఘట్టమనేని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
ఇక సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. సూపర్ కృష్ణ మృతికి పశ్చిమ గోదావరి జిల్లా వాసులు సైతం ఘన నివాళి అర్పించారు. ఆయన అకాల మృతికి సంతాపంగా మంగళవారం(నవంబర్ 15) పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా థియేటర్లో ఉదయం ఆటలను రద్దు చేసినట్లు జిల్లా డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ తెలిపారు.