అయోధ్య: లెజండరీ సింగర్ దివగంత లతామంగేష్కర్ 93వ జయంతి పురస్కరించుకుని ఆమె పేరు మీద అయోధ్యలో ఒక కూడలిని ఏర్పాటు చేశారు. దీన్ని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ప్రారంభించారు. ఈమేరకు సరయు నది వద్ద ఉన్న కూడలిలో దాదాపు రూ. 7.9 కోట్ల వ్యయంతో భారీ వీణను ఏర్పాటు చేశారు.
ఈ వీణ దాదాపు 40 అడుగుల పొడవు, 12 మీటర్ల ఎత్తులో 14 టన్నుల బరువు ఉంటుంది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ ట్వట్టర్‌లో...లతా దీదీ జయంతి సందర్భంగా ఆమెని స్మరించుకోవడమే గాక ఆమె తనపై చూపిన ఆప్యాయతను మరువలేనిదన్నారు. ఈ రోజు అయోధ్యలోని చౌక్‌కి ఆమె పేరు పెట్టడం అనేది భారతీయ దిగ్గజాలలో ఒకరిగా పేరుగాంచిని లతా దీదీకి దక్కిన తగిన నివాళి అని అన్నారు.
ఈ చౌక్ వద్ద ఏర్పాటు చేసిన ఈ భారీ సంగీత వాయిద్యం సంగీత ప్రియులకు గొప్ప ఆకర్షణగా ఉండటమే గాక ఇంత బారీ సంగీత పరికరాన్ని ఏర్పాటు చేయడం ఇదే ప్రధమమని అధికారులు తెలిపారు. అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీ కార్యదర్శి సత్యేంద్ర సింగ్ ఈ ప్రాజెక్టుకి సుమారు 7.9 కోట్లు ఖర్చు అయ్యిందని తెలిపారు. ఈ భారీ సంగీత వీణను పద్మశ్రీ అవార్డు గ్రహీత రామ్ సుతార్ తయారు చేశారని, సుమారు రెండు నెలల సమయం పట్టిందని తెలిపారు. అందంగా తీర్చిదిద్దిన ఈ వీణపై సరస్వతి చిత్రం కూడా చెక్కబడి ఉందని అన్నారు.
(చదవండి: రాహుల్‌ని చూసి భావోద్వేగం.. వెక్కి వెక్కి ఏడ్చిన యువతి: వీడియో వైరల్)
Comments
Please login to add a commentAdd a comment