
సాక్షి, ఖమ్మం: ఎవరైనా కన్నుమూస్తే సంతాప సూచకంగా వారి ఫొటోతో ఫ్లెక్సీ చేయించి కూడళ్లలో ఏర్పాటు చేయడం తెలిసిందే. అయితే ఖమ్మంలో మృతిచెందిన ఓ కోతికి సైతం ఫ్లెక్సీ చేయించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో తిరుగుతూ, నిత్యం హమాలీల మధ్య ఉంటూ.. వారు పెట్టే భోజనం తింటూ గడిపే ఓ కోతి ఇటీవల మృతి చెందింది.
దీంతో హమాలీలు ఆ వానరానికి అంత్యక్రియలు నిర్వహించడమే కాకుండా శుక్రవారం అన్నదానం సైతం నిర్వహించారు. ఇంతటితో సరిపెట్టకుండా ఆ కోతి ఫొటోతో ఫ్లెక్సీ చేయించి మార్కెట్ ప్రధాన గేటుకు పెట్టగా పలువురు ఆసక్తిగా పరిశీలించారు.
చదవండి: మహబూబాబాద్: టమాటా కూర అత్త ప్రాణం మీదకు తెచ్చింది
Comments
Please login to add a commentAdd a comment