
ఐపీఎల్ 2023 ఘన విజయంతో అత్యధిక ట్రోఫీలను కైవసం చేసుకుని.. సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ(ముంబై ఇండియన్స్) సరసన నిలిచాడు చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్ ధోని. నెక్స్ట్ సీజన్ ఐపీఎల్‌లో ఆడతాడా? లేదా? అనుమానంగానే ఉంది. అయితే తమ కెప్టెన్‌కు భావోద్వేగమైన వీడియోను అంకితమించింది సీఎస్కే. అయితే ఈ వీడియోపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
2023 ఐపీఎల్ సీజన్‌లో సీఎస్కే కెప్టెన్ ధోనీ క్రేజ్ మాములుగా కనిపించలేదు. స్టేడియంలోకి అడుగుపెట్టేటప్పటి నుంచి బంతుల్ని బౌండరీలకు తరలించేదాకా.. అభిమానం వెల్లువలా పొంగింది. ఒకానొక టైంలో ఇదే ధోనీకి లాస్ట్ ఐపీఎల్ సీజన్.. రిటైర్మెంట్ ప్రకటిస్తాడంటూ చర్చ జోరుగా సాగింది ఈ సీజన్ అంతా. అయితే..
తన రిటైర్మెంట్‌పై స్పష్టమైన ప్రకటన చేయకుండా మీడియాను గందరగోళంలోకి నెట్టేశాడు మిస్టర్ కూల్. ఈ తరుణంలో ఉన్నట్లుండి ధోనీ పై సీఎస్కే ఓ వీడియో ట్వీట్ చేయడం.. అదీ ఓ కెప్టెన్ మై కెప్టెన్ అంటూ క్యాప్షన్ ఉంచడంతో అభిమానుల్లోనూ పలు అనుమానాలు కలుగుతున్నాయి. దీనికి త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. గాయం కారణంగా మోకాలికి ఆపరేషన్ కాగా.. ప్రస్తుతం ధోనీ కోలుకుంటున్నాడు.
Oh Captain, My Captain! 🥹#WhistlePodu #Yellove 🦁💛 @msdhoni pic.twitter.com/whJeUjWUVd
— Chennai Super Kings (@ChennaiIPL) June 13, 2023
ఇదీ చదవండి: కోహ్లి అలా చేస్తాడని ఊహించలేదు!