సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా
తాడేపల్లిరూరల్: ఆధారాలను సేకరించడంలో న్యాయవాదులు ఓర్పు, నేర్పు కలిగి ఉండాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా సూచించారు. వడ్డేశ్వరంలోని కేఎల్ వర్సిటీలో ఏపీ బార్ కౌన్సిల్ ఆధ్వర్యాన మూడు రోజులుగా నిర్వహిస్తున్న న్యాయవాదుల అవగాహన సదస్సు ఆదివారం ముగిసింది. చివరి రోజు సదస్సుకు జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఆయన మాట్లాడుతూ భారతీయ న్యాయ సంహిత.. ఐపీసీని పోలి ఉందన్నారు. సైబర్ క్రైమ్, లింగ వివక్ష చట్టం, ఉగ్రవాద వ్యతిరేక చట్టాలలోని పలు సెక్షన్ల గురించి న్యాయవాదులకు అవగాహన కల్పించారు. ఆస్తి బదిలీ చట్టం, ఆస్తి హక్కు, నిర్దిష్ట ఉపశమన చట్టం, రిజిస్ట్రేషన్ చట్టం, మే«ధో సంపత్తి హక్కులు, ఎలక్ట్రానిక్ ఆధారాలు, రాజ్యాంగ లక్ష్యాలను సాధించడంలో న్యాయవాది పాత్ర, డాక్యుమెంటేషన్ వంటి పలు అంశాల గురించి న్యాయవాదులకు వివరించారు.
ఏపీ బార్ కౌన్సిల్ చైర్మన్ నల్లారి ద్వారకానాథ్‌రెడ్డి, కేఎల్‌యూ వీసీ డాక్టర్ జి.పార్థసారథివర్మ, ప్రో వైస్ చాన్సలర్‌లు డాక్టర్ ఏవీఎస్ ప్రసాద్, డాక్టర్ ఎన్.వెంకటరామ్, డాక్టర్ కె.రాజశేఖరరావు, రిజిస్ట్రార్ కె.సుబ్బారావు, న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పవన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment