awareness Conference
-
తగిన జాగ్రత్తలతో హెచ్ఎంపీవీ దూరం
హైదరాబాద్: హెచ్ఎంపీవీ గురించి భయపడాల్సిన అవసరం లేదని, కాస్త అప్రమత్తంగా ఉంటే సరిపోతుందని అమీర్‌పేటలోని ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రికి చెందిన ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్టు, ఇంటెన్సివిస్టు డాక్టర్ రత్నబాబు కొల్లాబత్తుల తెలిపారు. ఈ వైరస్ గురించి సర్వత్రా ఆందోళన నెలకొన్న నేపథ్యంలో.. యూసుఫ్‌గూడలోని పోలీసు బెటాలియన్‌లో శిక్షణ పొందుతున్న 300 మంది పోలీసులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.“హెచ్ఎంపీవీ అనేది సాధారణంగా అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ లోనే వస్తుంది. గొంతులో ఇబ్బంది ఉండొచ్చు, దగ్గు, జలుబు రావచ్చు. కొద్దిపాటి జ్వరం ఉండే అవకాశం ఉంది. అది బాగా ఎక్కువైతే అప్పుడు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అయ్యి, పిల్లికూతల్లా వచ్చి ఆయాసం రావచ్చు. కొందరిలో బ్రాంకైటిస్, న్యుమోనియా లాంటివి కూడా ఉంటాయి. చాలావరకు ఇది సాధారణంగానే ఉంటుంది. అయితే రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి, చిన్న పిల్లలకు సమస్య ఎక్కువ కావచ్చు. ఒకటి రెండు రోజులైనా తగ్గకపోతే అప్పుడు వైద్యుల వద్దకు వెళ్లి తగిన సూచనలు తీసుకోవాలి. దీని లక్షణాల్లో ప్రధానంగా ముక్కు దిబ్బడ, ముక్కు కారడం, గొంతులో గరగర, ఆయాసం, ఛాతీలో నొప్పి లాంటివి ఉంటాయి. కొందరికి మాత్రం ఒంటిమీద దద్దుర్లు కూడా వస్తాయి.కొత్త వైరస్ కాదుఇదేమీ కొత్తది కాదు.. ఎప్పుడో 2001లోనే నెదర్లాండ్స్‌లో దీన్ని కనుగొన్నారు. చిన్నపిల్లల్లో చాలావరకు ఇన్ఫెక్షన్లకు ఇది కారణం అవుతుంది. 10-15% మందిలో మాత్రమే దీని లక్షణాలు తీవ్రంగా కనిపిస్తాయి. వ్యాధి ఉన్నవారికి దగ్గరగా ఉన్నవారికి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది 2-5 రోజులే ఉంటాయి. తర్వాత దానంతట అదే తగ్గుతుంది. కొద్దిమందికి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అది ముదిరిపోయి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, న్యుమోనియాలకు దారితీస్తుంది. చాలావరకు దగ్గు, జలుబు లాంటి సాధారణ లక్షణాలే ఉంటాయి. ఇది సాధారణంగా ఒకరి నుంచి మరొకరికే వస్తుంది. లేదా అప్పటికే వ్యాధి ఉన్నవారికి దగ్గరగా వెళ్లినా, దగ్గు.. తుమ్ముల నుంచి వచ్చే తుంపరల ద్వారా సోకుతుంది. అప్పటికే వ్యాధి ఉన్నవారికి షేక్ హ్యాండ్ ఇచ్చినా, కౌగలించుకున్నా, ముద్దుపెట్టుకున్నా కూడా అది వస్తుంది. తలుపు హ్యాండిళ్లు, బొమ్మలు, ఫోన్లు, ఇతర ఉపరితలాలను వ్యాధి ఉన్నవాళ్లు ముట్టుకుని, వాళ్ల తుంపరలు వాటిమీద పడినప్పుడు వేరేవాళ్లు ముట్టుకుంటే అప్పుడు సోకే అవకాశం ఉంది.ఎవరికి రావచ్చుఐదేళ్లలోపు పిల్లలు దీని బారిన పడే అవకాశాలు ఎక్కువ. ఆస్థమా, సీఓపీడీ, దీర్ఘకాలికంగా ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారికి సోకితే దాని తీవ్రత ఎక్కువగా ఉంటుంది. తరచు ఏదో ఒక వ్యాధి బారిన పడుతున్నవారు, కీమోథెరపీ తీసుకుంటున్నవారు, అవయవమార్పిడి చేయించుకున్నవాళ్లు ఈ వైరస్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల బ్రాంకైటిస్, బ్రాంకియోలైటిస్, న్యుమోనియా, చెవిలో ఇన్ఫెక్షన్లు కూడా ఉంటాయి.గుర్తింపు.. చికిత్సకొవిడ్ తరహాలోనే శ్వాబ్ పరీక్ష ద్వారా దీన్ని గుర్తిస్తాం. కొందరికి ఆక్సిజన్ సపోర్ట్ ఇస్తాం. మరికొందరికి ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. కొంతమందిలో లక్షణాలు తగ్గకపోతే కార్టికో స్టెరాయిడ్స్ అవసరం అవుతాయి. లక్షణాలను బట్టే చికిత్స చేస్తాం తప్ప, దీనికి ప్రత్యేకంగా వైరస్‌ను తగ్గించే మందులంటూ ఏమీ ఉండవు.తీసుకోవాల్సిన జాగ్రత్తలుచేతులు తరచు సరిగా శుభ్రం చేసుకోవాలి. సబ్బు లేదా శానిటైజర్‌తో కడుక్కోవాలి. ముక్కు, నోరు, చెవులు.. వీటిని జాగ్రత్తగా కవర్ చేసుకోవాలి. వీలైనంత వరకు తప్పకుండా మాస్క్ వాడాలి. అనారోగ్యం ఉన్నా, లేకపోయినా ఇది మంచిది. అప్పటికే అనారోగ్యంగా ఉన్నవారికి దూరంగా ఉండాలి. కళ్లు, ముక్కు, నోరు.. వీటిని అస్సలు చేతులతో ముట్టుకోకూడదు. ఒకవేళ ముట్టుకోవాల్సి వస్తే, తప్పనిసరిగా ముందే చేతులు శుభ్రం చేసుకోవాలి. ఆహారం, పాత్రలను వేరే ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు. డీహైడ్రేషన్ అవుతున్నప్పుడు నీళ్లు, ఇతర ఫ్లూయిడ్స్ ఎక్కువగా తాగుతుండాలి. లక్షణాలు బాగా ఎక్కువ అవుతున్నాయనుకున్నప్పుడు దగ్గరలో ఉన్న వైద్యులను సంప్రదించాలి” అని డాక్టర్ రత్నబాబు వివరించారు.కార్యక్రమంలో ఇంకా ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి జనరల్ ఫిజిషియన్ డాక్టర్ కళ్యాణి, కమాండెంట్ మురళీకృష్ణ, అడిషనల్ కమాండెంట్ నరేంద్రసింగ్, బెటాలియన్‌కు చెందిన సివిల్ సర్జన్ డాక్టర్ మహమూద్ తదితరులు పాల్గొన్నారు. -
న్యాయవాదులకు ఓర్పు, నేర్పు అవసరం
తాడేపల్లిరూరల్: ఆధారాలను సేకరించడంలో న్యాయవాదులు ఓర్పు, నేర్పు కలిగి ఉండాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా సూచించారు. వడ్డేశ్వరంలోని కేఎల్ వర్సిటీలో ఏపీ బార్ కౌన్సిల్ ఆధ్వర్యాన మూడు రోజులుగా నిర్వహిస్తున్న న్యాయవాదుల అవగాహన సదస్సు ఆదివారం ముగిసింది. చివరి రోజు సదస్సుకు జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ భారతీయ న్యాయ సంహిత.. ఐపీసీని పోలి ఉందన్నారు. సైబర్ క్రైమ్, లింగ వివక్ష చట్టం, ఉగ్రవాద వ్యతిరేక చట్టాలలోని పలు సెక్షన్ల గురించి న్యాయవాదులకు అవగాహన కల్పించారు. ఆస్తి బదిలీ చట్టం, ఆస్తి హక్కు, నిర్దిష్ట ఉపశమన చట్టం, రిజిస్ట్రేషన్ చట్టం, మే«ధో సంపత్తి హక్కులు, ఎలక్ట్రానిక్ ఆధారాలు, రాజ్యాంగ లక్ష్యాలను సాధించడంలో న్యాయవాది పాత్ర, డాక్యుమెంటేషన్ వంటి పలు అంశాల గురించి న్యాయవాదులకు వివరించారు. ఏపీ బార్ కౌన్సిల్ చైర్మన్ నల్లారి ద్వారకానాథ్‌రెడ్డి, కేఎల్‌యూ వీసీ డాక్టర్ జి.పార్థసారథివర్మ, ప్రో వైస్ చాన్సలర్లు డాక్టర్ ఏవీఎస్ ప్రసాద్, డాక్టర్ ఎన్.వెంకటరామ్, డాక్టర్ కె.రాజశేఖరరావు, రిజిస్ట్రార్ కె.సుబ్బారావు, న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పవన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
రొయ్యకు బీమా.. రైతుకు ధీమా
సాక్షి, భీమవరం: ఆక్వా రైతుకు అడుగడుగునా అండగా నిలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం బీమా సదుపాయంతో సాగులో వారికి ధీమా కల్పించే దిశగా అడుగులు వేస్తోంది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో బీమా పాలసీ కల్పనకు ఇప్పటికే రాష్ట్రాన్ని కేంద్రం పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. బీమా పాలసీలపై రైతులకు అవగాహన కల్పించి, వారి అభిప్రాయాలు తీసుకునేందుకు ఆలిండియా ప్రాన్ ఫెడరేషన్, స్టేట్ ప్రాన్ ఫెడరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఏపీ స్టేట్ ఆక్వా డెవలప్మెంట్ అథారిటీ (అప్సడా) అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది. అందులో భాగంగా శనివారం పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరంలో అప్సడా వైస్ చైర్మన్ వడ్డి రఘురాం అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల నుంచి 200 మందికి పైగా ఆక్వా రైతు సంఘాల నాయకులు, రైతులు హాజరయ్యారు. ఓరియంటల్, అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ, అలయన్స్ ఇన్సూరెన్స్ బ్రోకర్స్ కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరై వారు అందించే పాలసీల వివరాలను రైతులకు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సాగు కాలం, ప్రీమియం రేట్లు, సైక్లోన్ జోన్, నాన్ సైక్లోన్ జోన్లలో పాలసీ కవరేజీ వివరాల గురించి అవగాహన కల్పించారు. రైతులు తమ ఎంపిక ప్రకారం 135 రోజుల నుంచి 180 రోజుల వరకు ప్రాథమిక కవర్‌ను ఎంచుకోవడం ద్వారా ప్రకృతి వైపరీత్యాల నుంచి పంట నష్టాన్ని కవర్ చేసుకోవచ్చునని తెలిపారు. పాలసీలపై రైతులు లేవనెత్తిన సందేహాలను బీమా సంస్థల ప్రతినిధులు నివృత్తి చేశారు. వ్యాధులు, వాతావరణ పరిస్థితులు, పెరుగుతున్న ఖర్చులు, మార్కెట్ సమస్యలు, ఇతర సవాళ్లను ఆక్వా రైతులు అధిగమించేందుకు ప్రభుత్వం బీమా పాలసీ తెచ్చిందని ఫిషరీస్ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ అంజలి ఈ సందర్భంగా తెలిపారు. ఫిషరీస్ జేడీ మాధవీలత, డిప్యూటీ డైరెక్టర్ ఆనందరావు, జిల్లా మత్స్యశాఖ అధికారి ఆర్వీఎస్వీ ప్రసాద్, నేషనల్ ప్రాన్ ఫార్మర్స్ అధ్యక్షుడు ఐపీఆర్ మోహనరావు, ఏపీ ప్రాన్ ఫార్మర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ జీకేఎఫ్ సుబ్బరాజు, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ మల్ల రాంబాబు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కృష్ణా ఆక్వా ఫార్మర్స్ అధ్యక్షుడు నాగభూషణం, వత్సవాయి కుమార్‌రాజా తదితరులు పాల్గొన్నారు. రైతుల ప్రయోజనాల కోసమే బీమా ఈ సదస్సులో అప్సడా వైస్ చైర్మన్ వడ్డి రఘురాం మాట్లాడుతూ ఆక్వా రైతుల ప్రయోజనాలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధిక ప్రాధాన్యమిస్తున్నారని చెప్పారు. ఏదోక పాలసీని తెచ్చి రైతులపై రుద్దకుండా వారి సూచన మేరకు ప్రయోజనకరమైన పాలసీ తేవాలన్న లక్ష్యంతో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు నిర్వహిస్తోందన్నారు. ఫిబ్రవరి 10 నాటికి సదస్సులు పూర్తి చేసి పాలసీలపై రైతుల నుంచి వచ్చిన సూచనలను సీఎం జగన్ దృష్టికి తీసుకువెళతామని తెలిపారు. గత ఎన్నికలకు ఆరు నెలల ముందు చంద్రబాబు ఆక్వా రైతులకు పెట్టిన రూ. 340 కోట్ల విద్యుత్ బకాయిలను వైఎస్ జగన్ ప్రభుత్వం చెల్లించిందని వివరించారు. అప్సడా ఏర్పడిన ఏడాదిన్నర కాలంలో రైతులకు మూడు లక్షలకు పైగా సబ్సిడీ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చామన్నారు. రాష్ట్రంలో బ్రూడల్ స్టాక్ మెయింటెనెన్స్ సెంటర్ (బీఎంసీ) ఏర్పాటులో గత ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం బంగారుపేటలో రూ. 36 కోట్లతో బీఎంసీ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించిందని, ఆగస్టు నాటికి ప్రారంభించే విధంగా సీఎం జగన్ యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారని రఘురాం తెలిపారు. -
నిరాధార వార్తలు.. జర్నలిజం విలువలకు వ్యతిరేకం: కొమ్మినేని
సాక్షి, విజయవాడ: నిరాధార వార్తలను ప్రచురించడం ప్రసారం చేయడం జర్నలిస్టు విలువలకు వ్యతిరేకమని సీఆర్ మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు అన్నారు. సీఆర్ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఆన్ లైన్ అవగాహన సదస్సులో జర్నలిజం డిప్లమో విద్యార్థులను, వర్కింగ్ జర్నలిస్టుల్ని ఉద్దేశించి "వార్తా రచన-నిజ నిర్ధారణ " అంశం పై సీనియర్ జర్నలిస్టు, యూనిసెఫ్ మీడియా అవార్డు గ్రహీత ఉడుముల సుధాకర రెడ్డి ప్రసంగానికి ముందు ఆన్ లైన్ అవగాహన సదస్సుకు అధ్యక్షత వహించి ఆయన మాట్లాడారు. ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు కొన్ని పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా చానెళ్లు పాఠశాలలో గొడుగులతో విద్యార్థుల ఫోటోలు, వీడియోలు తీసి, వర్షానికి తడిసి పోతున్నట్లు వార్తా కథనాలను ప్రచురించడం, ప్రసారం చేయడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే పాఠశాలను అధికారులు సందర్శించి దానిని "ఫేక్ న్యూస్" గా నిర్ధారించి చట్ట పరమైన చర్యలకు ఉపక్రమించారన్నారు. చదవండి: బాబు అండ్ బ్యాచ్ ఓవరాక్షన్.. నిర్మల సీతారామన్ చెప్పింది విన్నారా? ఒక పక్క ప్రభుత్వం పాఠశాలల మౌలిక సదుపాయాల అభివృద్ధికి దశలవారీగా పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తోన్న సంగతి తెల్సినా, ఇలా వ్యవహరించడం సమంజసం కాదన్నారు. ఇలా కొన్ని పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా చానెళ్లు వ్యవహరించడం రాష్ట్రం లో సర్వ సాధారణమైపోవడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. జర్నలిస్టుల వృత్తి ప్రమాణాలు, నైపుణ్యం పెంచడం మీడియా అకాడమీ బాధ్యత అని, అందుకే "వార్తా రాచన - నిజ నిర్ధారణ ", అంశం పై సీనియర్ జర్నలిస్టు, యూనిసెఫ్ మీడియా అవార్డు గ్రహీత ఉడుముల సుధాకర రెడ్డి ప్రసంగం ఏర్పాటు చేశామని ఆయన తమ అధ్యక్షుని తొలి పలుకుల్లో పేర్కొన్నారు. -
నా 46 ఏళ్ల జర్నలిస్టు అనుభవంలో మొదటిసారి చూస్తున్నా: కొమ్మినేని
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో ప్రస్తుతం పేదలు-పెత్తందార్ల మధ్య జరుగుతోన్న యుద్ధంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పేదల పక్షాన నిలిచారని సీఆర్ మీడియా అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు అన్నారు. స్థానిక సత్యనారాయణపురంలో శుక్రవారం నిర్వహించిన “జగనన్న బడుగు వికాసం” అవగాహన సదస్సులో ఎస్సీ, ఎస్టీ, బీసీ(సి) ఎంటర్ ప్రెన్యుర్లనుద్దేశించి ఆయన మాట్లాడారు. పేదల పక్షపాతిగా పేరుతెచ్చుకున్న ఇలాంటి ముఖ్యమంత్రిని తమ 46 ఏళ్ల జర్నలిస్టు అనుభవంలో మొట్ట మొదటి సారి చూస్తున్నామని ఆయన పేర్కొన్నారు. పేదల కోసం చెప్పింది చెప్పినట్లు చేస్తున్న ఈ ముఖ్యమంత్రిపై యుద్ధం చేయలేని కొంతమంది “వలంటీర్ల” పై యుద్ధం చేస్తుండడం విచారకరమని ఆయన అన్నారు. ఎండలో, వానలో ఇబ్బందులు పడుతూ పెన్షన్లు తెచ్చుకునే వృద్ధులకు ఇంటివద్దే, ఒకటోతేదీన పెన్షన్లు సమర్ధవంతంగా అందిస్తున్న వాలంటీర్ల వ్యవస్థను కించ పరచడం సరికాదన్నారు. నేనూ సమాజంలో ప్రయోజనకారిగా వుండే వ్యక్తిని అని ఆత్మ విశ్వాసంతో, పట్టుదలతో ముందుకెళ్ళాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ(సి) ఎంటర్ ప్రెన్యుర్లకు ఉద్బోధించారు. ప్రభుత్వం ఇచ్చే రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. స్వయంశక్తితో పది మందికి ఉపాధి కల్పించేందుకు ముందుకొచ్చేవారిని ప్రోత్సహించాలని ఆయన అన్నారు. చదవండి: అలాంటి క్యారెక్టర్ ఉన్నోడా వలంటీర్లను అనేది!: సీఎం జగన్ ఫైర్ సామాజిక న్యాయం, సాధికారిత రాష్ట్ర సలహాదారు జూపూడి ప్రభాకరరావు మాట్లాడుతూ, ప్రభుత్వాన్ని ఉపయోగించుకున్నవాళ్లే అభివృద్ధి చెందుతారని అన్నారు. ఈ ప్రభుత్వం మనది, ఈ ప్రభుత్వాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఈ రాష్టంలో 2 లక్షల 25 వేల కోట్లు పేదలకు పంపిణీ అయ్యిందని, అందులో 80 శాతం మేర నిధులు ఎస్.సి.ఎస్.టి వర్గాలకే అందిందని ఆయన గుర్తుచేశారు. ఇది పేదల ప్రభుత్వమని చెప్పేందుకు ఇంతకుమించి ఉదాహరణ ఏముంటుందని ఆయన ప్రశ్నించారు. 54 వేల ఎకరాల అసైన్డు భూములపై పేదలకు, దళితులకు సంపూర్ణ హక్కులు కల్పించిన ప్రభుత్వం ఇదని ఆయన ప్రస్తుతించారు. గత 70 ఏళ్లుగా తమ పేరున ఉన్న భూములపై పూర్తి హక్కులు ఈ వర్గాలకు లేవని, దళితుల, పేదల జీవితాలలో ఈ చర్య ద్వారా సీఎం జగన్ పెను మార్పులకు దోహద పడ్డారని ఆయన తెలిపారు. ప్రపంచం మొత్తాన్ని కలిపే ఇంగ్లీషు భాష ప్రాథమిక విద్యలో ప్రవేశపెట్టిన సాహసి మన ముఖ్య మంత్రి అని ఆయన అన్నారు. దళితుల పిల్లలను ఇంగ్లీషు లో చదివించే విప్లవాత్మక చర్యలు చేపట్టిన ముఖ్యమంత్రిని విమర్శించడం సరికాదన్నారు. సమావేశానికి క్రిస్టియన్ మైనారిటీస్ కార్పొరేషన్ చైర్మన్ బందెల దయానందం అధ్యక్షత వహించారు. సమావేశంలో సి.ఆర్.మీడియా అకాడమీ సెక్రెటరీ మామిడిపల్లి బాల గంగాధర తిలక్, సెంట్రల్ బ్యాంకు రీజినల్ హెడ్ ఎస్. సూర్యనారాయణ మూర్తి, పరిశ్రమలశాఖ అడిషనల్ డైరెక్టర్ ఏ.వి. పటేల్ , జాయింట్ డైరెక్టర్ ఏ. సుధాకర్, క్రిస్టియన్ మైనారిటీస్ కార్పొరేషన్ ఎం.డి. ఏ. శేఖర్, ఆరోగ్యశ్రీ ప్రత్యేక అధికారి వై. అశోక్ , ఎన్. హెచ్. ఆర్. ఏ. సి.సి. చైర్మన్ ఆర్.జె. రాజు, ఏ.ఎస్.ఎస్.ఎన్.టి. డైరెక్టర్ ఎన్. వెంకటరావు, వివిధ జిల్లాలనుంచి వచ్చిన ఎస్.సి. ఎస్.టి. ఎంటర్ ప్రెన్యూర్ లు పాల్గొన్నారు. -
‘ఆ బాధ్యత జర్నలిస్టులదే.. మీడియా గుర్తుంచుకోవాలి’
సాక్షి, విజయవాడ: నిబద్ధతతో పనిచేసే విలేకరుల అవసరం నేడు ఎంతైనా ఉందని, వాస్తవాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్లటంతో విలేకరుల పాత్ర ఎనలేనిదని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. జర్నలిజం మౌలిక సూత్రాలు- ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మీడియా పాత్ర అంశంపై అవగాహన సదస్సు ఆదివారం ఆర్టీసీ మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో ప్రెస్ అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు అధ్యక్ష్యతన జరిగింది. ఈ సందర్భంగా మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో నేడు జరుగుతున్న అభివృద్ధిని, సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి చేరవేయటానికి పత్రికలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని కొనియాడారు. నేడు కమ్యూనికేషన్ రంగం వేగంగా విస్తరిస్తుందని, వాటి ఫలాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అందులో భాగమైన సోషల్ మీడియాలో కూడా వాస్తవాలకు ప్రాధాన్యత ఇవ్వాలని.. అప్పుడే ఫలితాలు అద్భుతంగా ఉంటాయన్నారు. నిష్పక్షపాత జర్నలిజానికి ఎప్పటికీ ఆదరణ ఉంటుందని, వాస్తవాలను వక్రీకరించి ప్రచురించటం వలన నిజాన్ని కొద్ది రోజులు మాత్రమే తొక్కి పెట్టగలమని గుర్తించాలన్నారు. ఇటీవల కొన్ని పత్రికల్లో ఈ ధోరణి పెరిగిపోయిందని, వాటిని సరిదిద్దుకోవటం వలన సమాజానికి మేలు జరుగుతుందన్నారు. అధికారంలో ఏ పార్టీ ఉన్నా అంతిమంగా ప్రజలకు వాస్తవాలు అందించే మీడియాకు ఎప్పుడూ ఆదరణ ఉంటుందన్నారు. సైనికుడి చేతిలో ఆయుధం.. విలేకరి చేతిలో కలం ఒకటే: కొమ్మినేని ప్రెస్ అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ, సైనికుడి చేతిలో ఆయుధం, విలేకరి చేతిలో కలం ఒకేటనన్నారు. నిజాన్ని నిర్భయంగా వెల్లడించటానికి కలం కత్తి కంటే పదునుగా ఉపయోగించాలన్నారు. విలేకరులు సేవా దృక్పథంతో ఉండాలని, నిజాలను నిర్భయంగా వెల్లడించటానికి వెనకడుగు వేయాల్సిన అవసరం లేదన్నారు. నిజం నత్తనడకన నడిస్తే అబద్ధం మెరుపు వేగంతో నడుస్తుందని చమత్కరించారు. కాని జర్నలిస్టులు మాత్రం నిజానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని, అర్థసత్యాలు, అసత్యాలకు ప్రాధాన్యత ఇవ్వకూడదని సూచించారు. పత్రికలకు విశ్వసనీయతే ప్రాణం: మల్లాది విష్ణు ప్రణాళికా బోర్డు ఉపాధ్యక్షులు, శాసనసభ్యులు మల్లాది విష్ణు మాట్లాడుతూ పత్రికలకు విశ్వసనీయతే ప్రాణమన్నారు. ఒక పత్రికలో వచ్చిన వార్తకు ఖండన మరో పత్రికలో రావటం అనే కొత్త సాంప్రదాయం ఇటీవల మొదలైందన్నారు. అది మంచి సంస్కృతి కాదన్నారు. అయితే బురద జల్లటానికే అన్నట్లుగా వ్యవహరిస్తున్న పత్రికల దాడిని తిప్పి కొట్టడానికి మేము రాష్ట్రంలో అభివృద్ధి చేసి చూపిస్తున్నామన్నారు. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ట్స్ సమ్మిట్ పై కూడా అబద్ధాలు ప్రచారం చేశారని విచారం వ్యక్తం చేశారన్నారు. జర్నలిస్టులు సమాజానికి ప్రయోజకారిగా ఉండాలి: మందపాటి శేషగిరిరావు రాష్ట్ర గ్రంధాలయ పరిషత్ అధ్యక్షులు మందపాటి శేషగిరిరావు మాట్లాడుతూ అవాస్తవాలను ప్రచారం చేస్తే నడిచే ప్లేగు వ్యాధి అని ఓ ఇంగ్లీషు కవి అన్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. జర్నలిస్టులు సమాజానికి ప్రయోజకారిగా ఉండే రచనలు చేసిన పుస్తకాలను గ్రంధాలయ సంస్థ ద్వారా ప్రోత్సాహం అందిస్తామని ఒప్పంద పత్రాన్ని మంత్రి చేతుల మీదుగా విడుదల చేశారు. కార్యక్రమంలో అధికార భాషా సంఘం అధ్యక్షులు విజయ్ బాబు, ఎన్నార్టీఎస్ ఛైర్మన్ మేడపాటి వెంకట్, జర్నలిస్ట్ ప్రతిక సంపాదకులు కృష్ణంరాజు, అసిస్టెంట్ ప్రోఫెసర్ డాక్టర్ కేవీ శాంత కుమారి, ఏపీ ప్రెస్ అకాడమీ సెక్రటరీ మామిడిపల్లి బాలగంగాధర్ తిలక్, పత్రికా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. చదవండి: పశ్చిమగోదావరి: నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్ -
నాట్స్.. ఆర్థిక పాఠాలు.. మహిళలకు ప్రత్యేకం
ఫైనాన్షియల్ వెల్నెస్ బేసిక్స్ ఫర్ విమెన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఉత్తర అమెరికా తెలుగు సంఘం తెలిపింది. 2022 జనవరి 29వ తేదిన అమెరికా కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు ఈ కార్యక్రమం జరగనుంది. ఇందులో ఆర్థిక అంశాలపై విమన్ ఎంపర్మెంట్ లీడర్ గంది దుర్గాప్రశాంతి సలహాలు, సూచనలు అందిస్తారు. ఈ ప్రోగ్రామ్‌కి మాధవి మోడరేటర్‌గా వ్యవహరిస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే ఆసక్తి ఉన్నవారు www.NATSWORLD.ORD/WOMEN_EMPOWERMENT లింకులో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. -
కోవిడ్‌పై వదంతులు నమ్మొద్దు
న్యూఢిల్లీ: కోవిడ్–19 (కరోనా వైరస్)కు సంబంధించి వస్తున్న వదంతులను నమ్మరాదని, వైద్యుల సలహా, సూచనలను కచ్చితంగా పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రజలు షేక్హ్యాండ్లను మానేసి ఇతరులను పలకరించేందుకు నమస్కారాన్ని వాడాలని కోరారు. జన్ ఔషధి దివస్ సందర్భంగా శనివారం ప్రధాని మోదీ కొంతమంది జన ఔషధి దుకాణదారులు, ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన (పీఎంబీజేపీ) లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ‘కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ఈ తరుణంలో రకరకాల వదంతులు పుట్టుకొస్తాయి. కొంతమంది వైరస్‌కు దూరంగా ఉండేందుకు ఫలానాది తినమని సలహాలిస్తూంటారు. దయచేసి వేటినీ నమ్మవద్దు. ఏం చేసినా.. వైద్యులు చెప్పినట్లు మాత్రమే చేయండి. మీరే వైద్యులు కావొద్దు’అని ఆయన స్పష్టం చేశారు. జన ఔషధి పథకం ద్వారా భారీగా లబ్ధి పొందింది ఈ దేశ పేదలు మాత్రమేనని ప్రధాని మోదీ అన్నారు. పీఎంబీజేపీ ద్వారా దేశం మొత్తమ్మీద నెలనెలా కోటి మందికి ఔషధాలు చౌకగా అందుతున్నాయని, దేశవ్యాప్తంగా ఉన్న ఆరు వేల జన ఔషధి కేంద్రాల ద్వారా పేదల సొమ్ము రూ.2000 నుంచి 2500 కోట్లు ఆదా చేయగలిగామని వివరించారు. ఈ కేంద్రాల్లో మందులు గరిష్ట అమ్మకం రేటు కంటే 50 నుంచి 90 శాతం తక్కువ ధరకు లభిస్తాయని వివరించారు. కేన్సర్ వ్యాధి చికిత్సకు వినియోగించే మందులు మార్కెట్లో రూ.6500 వరకూ ఉంటే జన ఔషధి కేంద్రాల్లో కేవలం రూ.850 మాత్రమే ఉంటుందని ఆయన వివరించారు. ఈ కేంద్రాల నిర్వాహకుల శ్రమను గుర్తించేందుకు అవార్డులు అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. మీరు మా దేవుడు... ప్రధానితో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో డెహ్రాడూన్‌కు చెందిన దీపా షా అనే మహిళ మాట్లాడుతూ.. ‘నేను దేవుడిని చూడలేదు. కానీ మీలో మాకు దేవుడు కనిపిస్తున్నాడు’ అని వ్యాఖ్యానించడంతో ప్రధాని ఉద్వేగానికి గురయ్యారు. కాసేపు ఆయన ఏమీ మాట్లాడలేకపోయారు. 2011లో పక్షవాతానికి గురైన దీపా మాట్లాడుతూ.. ‘మొదట్లో నా∙మందుల ఖర్చు చాలా ఎక్కువగా ఉండేది. జన ఔషధి కేంద్రాల కారణంగా నెలకు రూ.3500 ఆదా చేయగలుగుతున్నాను’ అని మోదీతో చెప్పారు. ‘మీరు మీ ఆత్మస్థైర్యంతో∙వ్యాధిని జయించారు’అని మోదీ ఆమెతో అన్నారు. సుమారు 3.5 లక్షల మంది ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంలో భాగమయ్యారని, మూడు లక్షల మంది వృద్ధులకు పింఛన్ లభిస్తోందని ప్రధాని తెలిపారు. -
ఈవీఎంలపై అవగాహన
మెదక్ అర్బన్ : శాసనమండలి ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని పోలింగ్ కేంద్రాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎం)లపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ ధర్మారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ గురువారం నుంచి జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలపై అవగాహన కల్పిస్తామన్నారు. ఇప్పటికే మొదటి విడత ఈవీఎంల తనిఖీలు పూర్తయినట్లు వివరించారు. ఈవీఎంలను తనిఖీ చేసే విధానం, సీల్ చేసే విధానాన్ని జాయింట్ కలెక్టర్, ఆయా రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో వివరించినట్లు తెలిపారు. ప్రతి ఈవీఎంను తనిఖీ చేసి, శుభ్రం చేసిన తర్వాత అది సరిగ్గా పని చేస్తున్నట్లయితేనే వాటిని వినియోగిస్తామన్నారు. ఈ ప్రక్రియ మొత్తం సీసీ కెమెరాల్లో నిక్షిప్తమై ఉందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఉపాధ్యాయులు, పట్టభ«ద్రుల ఓట్ల తుది విడత రూపొందించడం జరిగిందన్నారు. పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటి వరకు పట్టభద్రులు 7,473 మంది, ఉపాధ్యాయులు 1,120 మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారని ఆయన వివరించారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ప్రతి మండల కార్యాలయంలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఎన్నికల సమయంలో మాక్ పోలింగ్ నిర్వహిస్తారని... ఈవీఎంలో అన్ని సరిగ్గా పని చేస్తున్నాయనే నిర్ధారణకు వచ్చిన తర్వాతనే పోలింగ్ కేంద్రాలకు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈవీఎంలలో డిజిటల్ క్లాక్ ద్వారా ఏ ఓటు ఎన్ని గంటల సమయంలో పోలైన విషయం కూడా స్పష్టంగా తెలుస్తుందని కలెక్టర్ వివరించారు. ఈవీఎంలను తనిఖీ చేసిన సమయంలో సరిగ్గా పని చేయని 22 కంట్రోల్ యూనిట్లు, 3 బ్యాలెట్ యూనిట్లు, 50 వీవీ ప్యాట్లను తిరిగి వెనక్కి పంపడం జరుగుతుందన్నారు. ఈవీఎంల పనితీరు, ఓటు వేసే విధానం గూర్చి జిల్లాలోని అన్ని మండలాల్లో, గ్రామాల్లో ప్రజలకు అవగాహన నిర్వహించడం జరుగుతుందన్నారు. 1950 నంబర్లో తెలుసుకోవచ్చు.. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి రిటర్నింగ్ అధికారిగా కలెక్టర్ వ్యవహరిస్తారని.. నామినేషన్ల ప్రక్రియ తదితరాలు కలెక్టరేట్లో నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా నూతనంగా ఓటరు నమోదు ప్రక్రియ కార్యక్రమం నిర్వహించగా మంచి స్పందన వచ్చిందని ఇందులో 21 వేలకు పైగా నూతనంగా ఓటర్లుగా నమోదు జరిగిందన్నారు. వాటిలో మెదక్ నియోజకవర్గంలో 11,391, నర్సాపూర్ నియోజకవర్గంలో 10,090 నూతనంగా ఓటర్లు నమోదు ప్రక్రియ జరిగిందని కలెక్టర్ వివరించారు. మెదక్ నియోజకవర్గంలో మూడు వేల పైచిలుకు, నర్సాపూర్ నియోజకవర్గంలో 1,200 ఓట్లు తొలగింపులు, మార్పులు, చేర్పులు చేయడం జరిగిందన్నారు. ఈనెల 22న తుది ఓటరు జాబితాను ప్రచురించడం జరుగుతుందని కలెక్టర్ వివరించారు. అలాగే ఓటరు జాబితాను ప్రతి గ్రామంలోని పోలింగ్ కేంద్రం వద్ద అతికించడం జరుగుతుందన్నారు. అలాగే గ్రామాల్లో నివాసం ఉండకుండా ఇతర ప్రాంతాలకు బతుకుదెరువు నిమిత్తం వలసవెళ్ళిన వారు, ఉద్యోగ రీత్యా వెళ్ళిన వారు తమ పేరు ఓటరు జాబితాలో ఉందా ? లేదా అనే విషయాన్ని 1950 నంబరుకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని తెలిపారు. నామినేషన్ల చివరి తేదీకి పది రోజుల ముందు వరకు ఓటరు నమోదుకు అవకాశం ఉంటుందని కలెక్టర్ ధర్మారెడ్డి వివరించారు. ఎన్నికల కమిషన్ ప్రతి పోలింగ్ కేంద్రంలో ఎన్నికల పాఠశాల (చునావ్ పాఠశాల) అని ఏర్పాటు చేసిందని... దీని ముఖ్య ఉద్దేశం ఎన్నికలపై అవగాహన, జరిగే తీరు, ఓటరు పాత్రపై అందరికి అవగాహన కల్పించడం అని తెలిపారు. ఈ పాఠశాలలను ఈనెల 23వ తేదీ నుంచి ప్రారంభించడం జరుగుతుందన్నారు. దీనికి బూత్ లెవల్ అధికారులు (బీఎల్వోలు) కో–ఆర్డినేటర్లుగా వ్యవహరిస్తారని కలెక్టర్ తెలిపారు. ప్రతి నెల మొదటి శనివారం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి అన్ని వివరాలను తెలియజేస్తారని కలెక్టర్ ధర్మారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈవీఎంలు, వీవీ ప్యాట్ల పనితీరు, సీల్ చేసిన విధానం, ఓట్ల లెక్కింపు చేసే ప్రక్రియను కలెక్టర్ వివరించారు. ఈ సమావేశంలో ఎన్నికల సిబ్బంది నజీర్ అహ్మద్, రవికుమార్, అధికారులు రాజిరెడ్డి, శైలేశ్వర్‌రెడ్డి, దేవయ్య తదితరులు పాల్గొన్నారు. -
మహిళలపై దౌర్జన్యాలను సహించబోం
నిజామాబాద్‌రూరల్: రోజురోజుకు పెరిగిపోతున్న మహిళలపై అత్యాచారాలు, దౌర్జన్యాలను సహించబోమని, ఇలాంటి ఘటనలను అరికట్టడం కోసం పోలీస్ శాఖ ఎంతో కృషి చేస్తుందని సీపీ కార్తికేయ పేర్కొన్నారు. నేరాలను అదుపుచేసేందుకు ప్రజల సహకారం అవసరమని ఆయన పేర్కొన్నారు. గురువారం నగర శివారులోని మేఘన దంత వైద్య కళాశాలలో జిల్లా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన షీటీం సంయుక్త అవగాహన సదస్సులో ఆయన పలు సూచనలు, సలహాలు అందజేశారు. ఫెండ్లీ పోలీస్ గురించి వివరించారు. విద్యార్థినులకు ఈవ్‌టీజింగ్, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై పోలీస్ డిపార్ట్మెంట్కు రిపోర్ట్ చేయాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రతాప్‌కుమార్ మాట్లాడుతూ నిజామాబాద్ పోలీస్ చేపడుతున్న వినూత్న కార్యక్రమాలను కొనియాడారు. నేడు మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారు, వారికి కావాల్సిన భద్రత కల్పించడం సమాజంలో అందరి బాధ్యత అని చెప్పారు. మహిళలు తమపై జరుగుతున్న అన్యాయాలను సహించకుండా ముందుకువచ్చి ఫిర్యాదు చేయాలన్నారు. షీ-టీం కానిస్టేబుల్ శ్రావణి విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు.మేఘన దంతవైద్య కళాశాల విద్యార్థులు షీ-టీమ్ గురించి నాటిక ప్రదర్శించారు. అనంతరం కమిషనర్ కార్తికేయ, సీఐ వెంకటేశ్వర్లును కళాశాల యాజమాన్యం సత్కరించారు. కార్యక్రమంలో షీ-టీం ఎస్సై వెంకటయ్య, రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్సై శ్రీధర్, డాక్టర్ సురేశ్‌కుమార్, డాక్టర్ శీనునాయక్, తదితరులు పాల్గొన్నారు. -
26న ఇంటిపంటల సాగుపై హైదరాబాద్‌లో రైతునేస్తం శిక్షణ
ఇంటి ఆవరణలో, మేడలపైన సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలు, ఔషధ మొక్కలను పెంచుకునే పద్ధతులపై ఈ నెల 26 (ఆదివారం) హైదరాబాద్, రెడ్‌హిల్స్, లక్డీకాపూల్‌లోని ఫ్యాప్సీ ఆడిటోరియంలో అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ వై.వెంకటేశ్వరరావు తెలిపారు. ఇంటిపంటల సాగులో అనుభవజ్ఞులు, శాస్త్రవేత్తలు, ఉద్యాన అధికారులు సదస్సులో పాల్గొని సూచనలు ఇస్తారన్నారు. ఉ. 10 గంటల నుంచి సా. 4 గం.ల వరకు సదస్సు జరుగుతుంది. జాతీయ విత్తన సంస్థ వారి కూరగాయ పంటల విత్తనాలను అందిస్తున్నామని, సేంద్రియ భోజనం ఉంటుందన్నారు. ఆసక్తిగల వారు 98493 12629, 94905 59999 నంబర్లలో ముందుగా పేర్లు నమోదు చేయించుకోవాలి. 26న కషాయాలు, ద్రావణాలపై కొర్నెపాడులో రైతులకు శిక్షణ రైతునేస్తం ఫౌండేషన్ ప్రతి ఆదివారం శిక్షణలో భాగంగా ఈ నెల 26న గుంటూరు జిల్లా పుల్లడిగుంట సమీపంలోని కొర్నెపాడులో సేంద్రియ వ్యవసాయంలో పంటలను ఆశించే తెగుళ్లు, చీడపీడల నివారణకు ఉపయోగించే కషాయాలు, ద్రావణాల తయారీ, వరి, కూరగాయల సాగుపై సీనియర్ సేంద్రియ రైతులు విజయ్‌కుమార్ (కడప), ధర్మారం బాజి (గుంటూరు) శిక్షణ ఇస్తారు. ఆసక్తిగల రైతులు 0863 2286255 నంబరులో సంప్రదించవచ్చు. -
భూ సేకరణపై సీఆర్డీఏ అవగాహన సదస్సు
-
సాక్షిమైత్రి అవగాహన సదస్సుకు విశేష స్పందన
-
ఏం.. తమాషా చేస్తున్నారా?
రాంబిల్లి: సమాచార హక్కు చట్టం సదస్సు వాయిదా వేసుకోవాలని తనకే హద్దులు నిర్ణయిస్తారా? ఏం తమాషాగా ఉందా? అంటూ రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ తాంతియాకుమారి శనివారం మండల అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక స్త్రీశక్తి భవనంలో శనివారం ఈ అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సమావేశానికి అధికారులు గైర్హాజరయ్యారు. దీంతోపాటు మండలంలో సమాచార హక్కు చట్టాన్ని అధికారులు సక్రమంగా అమలు చేయలేదని పలువురు ఫిర్యాదు చేయడంతో తాంతియకుమారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషనర్ తన పర్యటనను వాయిదా వేసుకోవాలని, రాంబిల్లిలో ఈ అవగాహన సదస్సు అవసరం లేదని మండల పరిషత్ అధికారులు చెప్పినట్లు స.హ. చట్టం రక్షణ వేదిక ఉత్తరాంధ్ర జిల్లాల కన్వీనర్ కాండ్రేగుల వెంకటరమణ సమావేశంలో మాట్లాడంతో తాంతియకుమారి అధికారుల తీరుపై విరుచుకుపడ్డారు. రాంబిల్లిలో సమావేశాలు వద్దని అనడానికి మీరెవరు.. ఏం.. తమాషాలు చేస్తున్నారా.. ఇకపై కార్యాలయాలను తనిఖీ చేస్తా.. సమాచార హక్కు కింద తగిన సమాచారం అందజేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటానంటూ హెచ్చరించారు. అయితే మండల పరిషత్ అధికారులెవరూ ఈ సమావేశానికి హాజరుకాలేదు. సమావేశం చివరిలో మండల పరిషత్ సూపరింటెండెంట్ డేవిడ్ బెరఖ్యా హాజరయ్యారు. దీంతో కమిషనర్ ఆయనపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. తీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవన్నారు. జన్మభూమి కార్యక్రమానికి ఎంపీడీవో , తహశీల్దారు వెళ్లారని ఆయన వివరణ ఇచ్చారు. అనంత రం తాంతియకుమారి విలేకరులతో మాట్లాడుతూ కోర్టులో కేసులు నడుస్తున్నప్పటికీ ప్రజలు అడిగిన సమాచారం అధికారులు ఇవ్వాల్సిందేనన్నారు. రాంబిల్లి సర్పంచ్ పిన్నంరాజు రాధా సుందర సుబ్బరాజు(కిషోర్), ఎన్‌వైకే జిల్లా సమన్వయకర్త బి. అప్పారావు, గ్రామ నాయకులు పాల్గొన్నారు. అధికారుల్లో టెన్షన్.. టెన్షన్ ఇదిలా ఉంటే తాంతియకుమారి పర్యటనతో జన్మభూమి కార్యక్రమాల్లో భాగంగా మర్రిపాలెం, మురకాడ గ్రామాల్లో ఉన్న పలువురు అధికారులు ఉలిక్కిపడ్డారు. సమావేశంలో అధికారులు, అనుచరులకు ఫోన్ చేసి ఆమె పర్యటనపై ఆరా తీశారు. -
పథకాల అమలుపై అవగాహన తప్పనిసరి
కలెక్టరేట్, న్యూస్‌లైన్: ‘మీరు గ్రామాల పాలకులు.. ప్రభుత్వం అమలు చేసే ప్రతి కార్యక్రమం గురించి మీకు తెలిసి ఉండాలి. సంక్షేమ పథకాల అమలుపై పూర్తిస్థాయిలో అవగాహన ఉండాలి. అప్పుడే ఆ ఫలాలు అర్హులకు అందుతాయి’ అని కలెక్టర్ స్మితా సబర్వాల్ సూచించారు. బుధవారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో మెదక్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులకు జీఓ 10లోని 25 అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల సమగ్రాభి వృద్ధికి సర్పంచ్‌లు కృషి చేయాలన్నారు. ప్రభుత్వం ద్వారా వివిధ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు గ్రామాల్లో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నందున వాటిపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. స్కోర్ కార్డు అనే ప్రత్యేక వెబ్సైట్ ద్వారా గ్రామం ఏ ర్యాంకులో ఉందో తెలుసుకోవచ్చన్నారు. ఇతర గ్రామాల్లో అమలవుతున్న విధానాలను గుర్తించడంతోపాటు మన గ్రామంలోనూ ఎలాంటి చర్యలు చేపట్టవచ్చో తెలుసుకునేందుకు వీలుకలుగుతుందన్నారు. వందశాతం వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకుంటే ప్రభుత్వం నిర్మల్ గ్రామంగా గుర్తించి రూ.20 లక్షలు విడుదల చేస్తుందన్నారు. ఈ నిధులతో గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవచ్చన్నారు. ఉపాధి హమీలో కూలీల సంఖ్యను పెంచాలని సూచించారు. ‘మార్పు’ కార్యక్రమం కింద ఎస్‌హెచ్‌జీ సమావేశాల్లో గర్భిణుల నమోదు, మాతాశిశు మరణాల రేటు తగ్గించడంలో సహకరించాలన్నారు. ఈ సదస్సులో జడ్పీ సీఈఓ ఆశీర్వాదం, డీపీఓ ప్రభాకర్‌రెడ్డి, హౌసింగ్ పీడీ బాల్‌రెడ్డి, డ్వామా పీడీ రవీందర్, డీఆర్డీఏ పీడీ రాజేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.