ఇంటి ఆవరణలో, మేడలపైన సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలు, ఔషధ మొక్కలను పెంచుకునే పద్ధతులపై ఈ నెల 26 (ఆదివారం) హైదరాబాద్, రెడ్‌హిల్స్, లక్డీకాపూల్‌లోని ఫ్యాప్సీ ఆడిటోరియంలో అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ వై.వెంకటేశ్వరరావు తెలిపారు. ఇంటిపంటల సాగులో అనుభవజ్ఞులు, శాస్త్రవేత్తలు, ఉద్యాన అధికారులు సదస్సులో పాల్గొని సూచనలు ఇస్తారన్నారు. ఉ. 10 గంటల నుంచి సా. 4 గం.ల వరకు సదస్సు జరుగుతుంది. జాతీయ విత్తన సంస్థ వారి కూరగాయ పంటల విత్తనాలను అందిస్తున్నామని, సేంద్రియ భోజనం ఉంటుందన్నారు. ఆసక్తిగల వారు 98493 12629, 94905 59999 నంబర్లలో ముందుగా పేర్లు నమోదు చేయించుకోవాలి.
26న కషాయాలు, ద్రావణాలపై కొర్నెపాడులో రైతులకు శిక్షణ
రైతునేస్తం ఫౌండేషన్ ప్రతి ఆదివారం శిక్షణలో భాగంగా ఈ నెల 26న గుంటూరు జిల్లా పుల్లడిగుంట సమీపంలోని కొర్నెపాడులో సేంద్రియ వ్యవసాయంలో పంటలను ఆశించే తెగుళ్లు, చీడపీడల నివారణకు ఉపయోగించే కషాయాలు, ద్రావణాల తయారీ, వరి, కూరగాయల సాగుపై సీనియర్ సేంద్రియ రైతులు విజయ్‌కుమార్ (కడప), ధర్మారం బాజి (గుంటూరు) శిక్షణ ఇస్తారు. ఆసక్తిగల రైతులు 0863 2286255 నంబరులో సంప్రదించవచ్చు.
26న ఇంటిపంటల సాగుపై హైదరాబాద్‌లో రైతునేస్తం శిక్షణ
Published Tue, Nov 21 2017 5:10 AM | Last Updated on Tue, Nov 21 2017 5:15 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment