సాక్షి, విజయవాడ: నిరాధార వార్తలను ప్రచురించడం ప్రసారం చేయడం జర్నలిస్టు విలువలకు వ్యతిరేకమని సీఆర్ మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు అన్నారు. సీఆర్ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఆన్ లైన్ అవగాహన సదస్సులో జర్నలిజం డిప్లమో విద్యార్థులను, వర్కింగ్ జర్నలిస్టుల్ని ఉద్దేశించి "వార్తా రచన-నిజ నిర్ధారణ " అంశం పై సీనియర్ జర్నలిస్టు, యూనిసెఫ్ మీడియా అవార్డు గ్రహీత ఉడుముల సుధాకర రెడ్డి ప్రసంగానికి ముందు ఆన్ లైన్ అవగాహన సదస్సుకు అధ్యక్షత వహించి ఆయన మాట్లాడారు.
ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు కొన్ని పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా చానెళ్లు పాఠశాలలో గొడుగులతో విద్యార్థుల ఫోటోలు, వీడియోలు తీసి, వర్షానికి తడిసి పోతున్నట్లు వార్తా కథనాలను ప్రచురించడం, ప్రసారం చేయడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే పాఠశాలను అధికారులు సందర్శించి దానిని "ఫేక్ న్యూస్" గా నిర్ధారించి చట్ట పరమైన చర్యలకు ఉపక్రమించారన్నారు.
చదవండి: బాబు అండ్ బ్యాచ్ ఓవరాక్షన్.. నిర్మల సీతారామన్ చెప్పింది విన్నారా?
ఒక పక్క ప్రభుత్వం పాఠశాలల మౌలిక సదుపాయాల అభివృద్ధికి దశలవారీగా పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తోన్న సంగతి తెల్సినా, ఇలా వ్యవహరించడం సమంజసం కాదన్నారు. ఇలా కొన్ని పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా చానెళ్లు వ్యవహరించడం రాష్ట్రం లో సర్వ సాధారణమైపోవడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. జర్నలిస్టుల వృత్తి ప్రమాణాలు, నైపుణ్యం పెంచడం మీడియా అకాడమీ బాధ్యత అని, అందుకే "వార్తా రాచన - నిజ నిర్ధారణ ", అంశం పై సీనియర్ జర్నలిస్టు, యూనిసెఫ్ మీడియా అవార్డు గ్రహీత ఉడుముల సుధాకర రెడ్డి ప్రసంగం ఏర్పాటు చేశామని ఆయన తమ అధ్యక్షుని తొలి పలుకుల్లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment