'నా భర్తను వామన్‌రావు హత్య చేశాడు’ | Women Alleges Vaman Rao Killed My Husband From Karimnagar | Sakshi
Sakshi News home page

'నా భర్తను వామన్‌రావు హత్య చేశాడు’

Published Sun, Feb 21 2021 8:19 PM | Last Updated on Sun, Feb 21 2021 8:27 PM

Women Alleges Vaman Rao Killed My Husband From Karimnagar - Sakshi

సాక్షి,కరీంనగర్‌: ఇరిగేషన్‌శాఖలో పనిచేస్తుండే తన భర్త వెంకటేశ్వర్లును ఇటీవల హత్యకు గురైన హైకోర్టు న్యాయవాది వామన్‌రావు హత్య చేశాడని వెంకటేశ్వర్లు భార్య నల్లవెల్లి అరుణజ్యోతి ఆరోపించారు. శనివారం కరీంనగర్‌ ప్రెస్‌భవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ 2008లో తన కుమారుడికి ఉద్యోగం ఇప్పిస్తానని రూ.1.50లక్షలు తీసుకుని ఉద్యోగం ఇప్పించలేదని పేర్కొన్నారు.

డబ్బు తిరిగి ఇవ్వాలని అడిగినందుకు తన భర్తను కరీంనగర్‌ అల్గునూర్‌ వద్ద కిడ్నాప్‌ చేసి నల్గొండ జిల్లా వెలిగొండ గ్రామంలో హత్య చేసినట్లు ఆమె ఆరోపించారు. హోంమంత్రి, ప్రజాప్రతినిధులు, పోలీస్‌ అధికారుల వద్దకు వెళ్లినా తనకు న్యాయం జరగలేదన్నారు. తన లాంటి బాధితులు చాలా మంది ఉన్నారని తెలిపారు. అతడిపై చాలా కేసులున్నాయని, పోలీస్‌లు న్యాయం చేయాలని కోరారు. నల్లవెల్లి సందీప్, కుటుంబసభ్యులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement