
ఆదిలాబాద్‌టౌన్: సంచలనం రేపిన సమత కేసు విషయంలో నిందితుల తరఫున వాదించేందుకు సీనియర్ న్యాయవాది రహీంను నియమించారు. కోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును వాదించేందుకు అయన అంగీకరించారు. ఈ నేపథ్యంలో నిందితుల కేసు పత్రాలను స్వీకరించారు. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న నిందితులు షేక్ బాబు, షేక్ షాబొద్దీన్, షేక్ ముగ్దూమ్‌లను బుధవారం మరోసారి కోర్టు ఎదుట హాజరు పర్చనున్నారు. కాగా, ఈ కేసులో పోలీసులు 44 మంది సాక్షులను విచారించారు. ఈ నెల 19 నుంచి కేసు కోర్టులో ట్రయల్‌కు వచ్చే అవకాశం ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ రమణారెడ్డి, నిందితుల తరపు న్యాయవాది రహీం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment