ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్రం పట్టించుకోవడం లేదనే మనస్తాపంతో కర్నూలుకు చెందిన న్యాయవాది అనిల్ కుమార్ ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. నంద్యాల కోర్టు ఆవరణలో పురుగుల మందు తాగారు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. కాగా ప్రస్తుతం అనిల్ కుమార్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.