సాక్షి, హైదరాబాద్: రామగుండం రెండో దశకు రాష్ట్ర ప్రభుత్వం మోకాలడ్డుతోందని తప్పుడు వార్తను ప్రచురించిన ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రికపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ అడ్వకేట్ జేఏసీ ప్రతినిధులు శనివారం జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ కె.గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ .. రామగుండం రెండో దశకు రాష్ట్ర ప్రభుత్వం అడ్డు తగులుతుందని నిరాధారమైన వార్తలు ప్రచురించిందన్నారు.
కేవలం ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలనే ఉద్దేశంతో కల్పిత వార్తలు ప్రచురిస్తున్నారన్నారు. గత 15 రోజుల్లో విద్యుత్‌పై ఆంధ్రజ్యోతిలో అసత్య కథనాలు వచ్చాయన్నారు. 24 గంటలు నాణ్యమైన కరెంటు ఇస్తూ ప్రజల అభిమానం పొందుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఇలాంటి కథనాలు ప్రచురించడం సబబు కాదన్నారు. దీని వెనుక పెద్దల కుట్ర ఉందని ఆరోపించారు. అసత్య వార్తలు ప్రచురించిన సదరు దినపత్రికపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment