ramagundam power plant
-
మెగావాట్‌కు వ్యయం రూ.16.7 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రామగుండంలో 800 మెగావాట్ల కొత్త థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణానికి తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) పాలక మండలి పచ్చజెండా ఊపింది. రాష్ట్ర ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి, జెన్కో సీఎండీ సందీప్‌కుమార్ సుల్తానియా అధ్యక్షతన గురువారం విద్యుత్ సౌధలో సమావేశమైన జెన్కో పాలక మండలి.. ఈ మేరకు డీపీఆర్‌ను ఆమోదించింది. మెగావాట్‌కు రూ.16.7 కోట్ల చొప్పున 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మించడానికి రూ.13,360 కోట్ల అంచనాతో డీపీఆర్ రూపొందించినట్లు అధికారవర్గాలు తెలిపాయి. రామగుండంలో జెన్కోకి చెందిన 62.5 మెగావాట్ల థర్మల్ బీ స్టేషన్ కాలం చెల్లడంతో గతేడాది మూసేశారు. దీని స్థానంలోనే కొత్తగా 800 మెగావాట్ల విద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. దీనిని సింగరేణి, జెన్కో ఉమ్మడి భాగస్వామ్యంతో నిర్మిస్తామని గతంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించగా, పూర్తిగా జెన్కో ఆధ్వర్యంలోనే నిర్మించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. జెన్కో ఆధ్వర్యంలో నిర్మిస్తామని ఇటీవల భట్టి హామీ ఇచి్చనట్టు అధికారులు తెలిపారు. యాదాద్రి, భద్రాద్రి కంటే ఎక్కువే.. రామగుండం విద్యుత్ కేంద్రం నిర్మాణానికి మెగావాట్‌కు రూ.16.7 కోట్లతో రూపొందించిన అంచనాలు దేశంలోనే ఇప్పటి వరకు అత్యధికమని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక శాసనసభలో విద్యుత్‌పై పెట్టిన శ్వేతపత్రం ప్రకారం.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మెగావాట్‌కు వ్యయం రూ.6.27 కోట్ల చొప్పున 4000 మెగావాట్ల యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి రూ.25,009 కోట్లతో అంచనాలను సిద్ధం చేయగా, నిర్మాణ దశలో ఖర్చు మెగావాట్‌కి రూ.8.64 కోట్లకు పెరిగి మొత్తం వ్యయం రూ.34,543 కోట్లకు ఎగబాకింది. ఇక మెగావాట్‌కి రూ.6.75 కోట్లు చొప్పున 1080 మెగావాట్ల భదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి డీపీఆర్‌ను సిద్ధం చేయగా, నిర్మాణం పూర్తయ్యే సరికి వ్యయం మెగావాట్‌కి రూ.9.74 కోట్లకు పెరిగింది. ఈ లెక్కన రామగుండంలో నిర్మించతలపెట్టిన 800 మెగావాట్ల విద్యుత్ కేంద్రం పూర్తయ్యే సరికి మెగావాట్‌కి రూ.20 కోట్లకు మించిపోవచ్చని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. దీని అంచనా వ్యయం ప్రాథమిక దశలోనే అసాధారణంగా ఉండడంతో నిర్మాణం పూర్తయ్యే సరికి మరింతగా పెరిగి ప్రజలపై భారం పడే అవకాశాలున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూనిట్ విద్యుత్ ధర రూ.10కి మించితుందని చెబుతున్నారు. -
‘రామగుండం’లో ఉత్పత్తి ఆగలేదు
ఫెర్టిలైజర్ సిటీ: రామగుండం ఫెర్టిలైజర్స్ కర్మాగారం (ఆర్ఎఫ్సీఎల్)లో ఉత్పత్తి యథావిధిగా కొనసాగుతోంది. ఉత్పత్తిని ఆపాలని కాలుష్య నియంత్రణ మండలి శనివారం ఆదేశించింది. కానీ కర్మాగారంలో ఆదివారం కూడా 3,850 టన్నుల యూరియా ఉత్పత్తి జరిగింది. ఈ కర్మాగారంలో ఉత్పత్తిని నిలిపివేయాల్సిందిగా శనివారం కాలుష్య నియంత్రణ మండలి ఉత్తర్వులివ్వడం తెలిసిందే. దీనిపై ఫ్యాక్టరీ యాజమాన్యం సోమవారం మండలి అధికారులతో సమావేశమైంది. దేశవ్యాప్తంగా యూరియాకు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో.. కర్మాగారంలో ఉత్పత్తి ఆపితే రైతులకు సకాలంలో ఎరువులు అందించడం ఇబ్బందిగా మారుతుందని తెలిపింది. అమ్మోనియా గ్యాస్, వ్యర్థ జలాల కాలుష్యంపై వివరణకు సమయం ఇవ్వాలని కోరింది. దీనికి అంగీకరించిన అధికారులు ఎరువుల ఉత్పత్తిని కొనసాగించేలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, రాష్ట్రంలో యూరియా నిల్వలు పుష్కలంగా ఉన్నాయని వ్యవసాయశాఖ కమిషనర్ ఎం. రఘునందన్‌రావు తెలిపారు. -
‘ఆంధ్రజ్యోతి’పై చర్యలు తీసుకోవాలి
సాక్షి, హైదరాబాద్: రామగుండం రెండో దశకు రాష్ట్ర ప్రభుత్వం మోకాలడ్డుతోందని తప్పుడు వార్తను ప్రచురించిన ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రికపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ అడ్వకేట్ జేఏసీ ప్రతినిధులు శనివారం జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ కె.గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ .. రామగుండం రెండో దశకు రాష్ట్ర ప్రభుత్వం అడ్డు తగులుతుందని నిరాధారమైన వార్తలు ప్రచురించిందన్నారు. కేవలం ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలనే ఉద్దేశంతో కల్పిత వార్తలు ప్రచురిస్తున్నారన్నారు. గత 15 రోజుల్లో విద్యుత్‌పై ఆంధ్రజ్యోతిలో అసత్య కథనాలు వచ్చాయన్నారు. 24 గంటలు నాణ్యమైన కరెంటు ఇస్తూ ప్రజల అభిమానం పొందుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఇలాంటి కథనాలు ప్రచురించడం సబబు కాదన్నారు. దీని వెనుక పెద్దల కుట్ర ఉందని ఆరోపించారు. అసత్య వార్తలు ప్రచురించిన సదరు దినపత్రికపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. -
రామగుండం విద్యుత్ ప్లాంట్ సందర్శించిన కేసీఆర్
-
‘రామగుండం’కు తప్పిన గండం
సాక్షి, హైదరాబాద్: రామగుండం బి.థర్మల్ విద్యుత్ కేంద్రానికి గండం తప్పింది. ఆరు దశాబ్దాల నాటి ఈ పాత ప్రాజెక్టు మరమ్మతుకు కావాల్సిన విడిభాగాలు ఎట్టకేలకు లభించాయి. త్వరలో అధికారులు విద్యుత్ ప్లాంట్‌ను పునరుద్ధరించనున్నారు. విద్యుత్ ఉత్పత్తిలో కీలకమైన స్టీమ్ టర్బైన్ పరికరం విరిగిపోవడం, ఇతర సాంకేతిక లోపాలు తలెత్తడంతో గతేడాది సెప్టెంబర్ 14 నుంచి రామగుండం ప్లాంట్‌లో ఉత్పత్తి నిలిచిపోయింది. రూ.40 కోట్లు వెచ్చించి ప్లాంట్ పునరుద్ధరణ చేసినా ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఈ ప్రాజెక్టు భవితవ్యంపై ఆందోళన నెలకొంది. ఎలాగైనా ఈ విడిభాగాలను సాధించేందుకు తెలంగాణ జెన్కో గత కొన్ని నెల లుగా నిర్వహించిన అన్వేషణ ఫలిం చింది. ఒరిస్సాలోని తాల్చేర్తోపాటు మహారాష్ట్రలోని అకోల జిల్లా పరాస్‌లో ఇప్పటికే మూతబడిన పాత థర్మల్ ప్లాంట్ విడిభాగాలను పరిశీలించారు. మహారాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థ(మహాజెన్‌కో) 1967లో 62.5 మెగావాట్ల సామర్థ్యంతో పరాస్‌లో నిర్మితమైన ప్లాంట్‌లో రామగుండం ప్లాంట్‌కు సరి పడే స్టీమ్టర్బైన్స్, ఇతర పరికరాలున్నట్లు గుర్తిం చారు. మహాజెన్కోతో చర్చలు జరిపి పాత పరికరాలను కొనుగోలు చేశారు. మరమ్మతులను పూర్తి చేసి సోమవారం నుంచి ఉత్పత్తి ప్రారంభిస్తామని జెన్కో అధికారులు తెలిపారు. ప్లాంట్ మరో దశాబ్దం పాటు విద్యుత్ ఉత్పత్తికి దోహదపడనుంది.