
Case File Against Katrina Kaif and Vicky Kaushal In Rajasthan: పెళ్లి వేడుకలు, ప్రేమ వ్యవహారాలు, బ్రేకప్ ఏం జరిగిన బాలీవుడ్ ఫిల్మ్ దునియాలో హాట్ టాపిక్ అవుతాయి. ప్రధానంగా స్టార్ కపుల్స్ వివాహం అంటే చాలు భారీ స్థాయిలో క్రేజ్ ఉంటుంది. ఈ క్రమంలో సీక్రెట్‌గా బాలీవుడ్ లవ్‌బర్డ్స్ కత్రీనా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లి ఏర్పాట్లు జరగుతున్నాయి. వారి పెళ్లికి సంబంధించిన విషయాలను ఈ జంట గోప్యంగా ఉంచినప్పటికీ ఆ వార్తలు బయటకు వస్తూనే ఉన్నాయి. కాగా రాజస్తాన్‌లోని సవాయ్ మాధోపూర్ జిల్లా సిక్స్ సెన్సెస్ కోటలో డిసెంబర్ 9న కత్రినా-విక్కీల పెళ్లి అంగరంగ వైభవంగా జరగనుందని టాక్. ఇప్పటికే మెహందీ, సంగీత్‌లో భాగంగా ఈ జంట రాజస్థాన్‌కు పయనమైనట్లు సన్నిహిత వర్గాల నుంచి సమచారం.
చదవండి: విడాకులపై సమంత కామెంట్స్, వైరల్ అవుతోన్న చై-సామ్ ఓల్డ్ ఫోన్ కాల్
రాజస్తాన్‌లో వీరి పెళ్లి ఏర్పాట్లకు భారీ బందోబస్తును నియమించారు. ఈ క్రమంలో అక్కడి స్థానికులు విక్కీ-కత్రీనాలకు షాకిచ్చారు. రాజస్థాన్‌కు చెందిన ఓ అడ్వకేట్ ఈ జంటపై స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కాగా రాజస్థాన్‌లో చౌత్‌మాత మందిర్ ఎంత ప్రఖ్యాతిగాంచిందో తెలిసిన విషయమే. నిత్యం భక్తులతో ఈ మందిరం రద్దీగా ఉంటుంది. అయితే విక్కీ-కత్రినాల పెళ్లి ఏర్పాట్లలలో భాగంగా ఈ మందిర్‌కు వెళ్లే రోడ్డును డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 12 వరకు తాత్కలికంగా ఈవెంట్ నిర్వాహకులు మూసేశారు. దీంతో స్థానికులు వీరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజస్థాన్‌కు చెందిన నైత్రాబింద్ సింగ్ జాదౌన్ అనే న్యాయవాది జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీకి ఫిర్యాదు చేశారు.
చదవండి: ఇండస్ట్రీలో 20 ఏళ్లుగా కొనసాగుతున్నా.. అయినా కష్టంగా ఉంది: నటుడు ఆవేదన
పెళ్లి వేడుకలో భాగంగా ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్న అమ్మవారి టెంపుల్ దారిని మూసివేయడాన్ని ఆయన వ్యతిరేకిస్తూ పిటిషన్ దాఖలు చేశాడు. తన పిటిషన్‌లో సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బార్వారా మేనేజర్, కత్రినా కైఫ్, విక్కీ కౌశల్‌తో పాటు జిల్లా కలెక్టర్‌పై ఫిర్యాదు చేశాడు. అయితే విక్కీ కౌశల్-కత్రీనా పెళ్లికి తాను వ్యతిరేకం కాదని, దీనిపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. కేవలం అమ్మవారి టెంపుల్ దారిని మూసివేసిన కారణంగానే తాను ఫిర్యాదు చేసినట్లు స్పష్టం చేశాడు. అంతేగాక వెంటనే ఆ దారిని తిరిగి తెరవాల్సిందిగా ఆయన లీగల్ సర్వీసెస్ అథారిటీ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment