దొండపర్తి (విశాఖ దక్షిణ): సినిమాకు వెళ్లాలంటే.. సాధారణ థియేటర్‌కా.. మల్టీప్లెక్సుకా.. అంటూ అనేక ఆలోచనలు చేస్తుంటాం. కానీ కొద్ది రోజుల తరువాత ఈ చాయిస్ లిస్టులో ఇగ్లూ థియేటర్ కూడా చేరనుంది. పుర్రెకో బుద్ధి అన్న నానుడికి తగ్గట్టుగా ఆనంద్‌కు వచ్చిన సరికొత్త ఆలోచనతో సినిమా థియేటర్ రూపుదిద్దుకుంటోంది. ఈ థియేటర్ కోసం రూ.కోట్లు ఖర్చు చేస్తున్నాడని అనుకుంటే పప్పులో కాలేసినట్లే.
చదవండి: ‘నర్సీపట్నం పిల్లి బయటకు రావాలి’
విశాఖ జిల్లాలో ఆనందపురం జంక్షన్ ఫ్లై ఓవర్ తరువాత జాతీయ రహదారికి ఆనుకొని ఏ స్క్వేర్ గోకార్టింగ్ వద్ద ఈ ఇగ్లూ థియేటర్ రూపుదిద్దుకుంటోంది. నెలన్నర క్రితం ప్రారంభమైన ఈ థియేటర్ నిర్మాణం ఇంకో నెల రోజుల్లో పూర్తి కానుంది. ఆగస్టు నెలలో థియేటర్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
థియేటర్ ప్రత్యేకతలు..
కేవలం 500 గజాల్లో ఇగ్లూ తరహాలో ఎఫ్‌ఆర్‌పీ మెటీరియల్‌తో ఈ థియేటర్‌ను నిర్మిస్తున్నారు. ఈ మినీ థియేటర్‌లో వంద మంది కూర్చొనే విధంగా సీట్ల ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఫుల్ ఏసీ, హైక్వాలిటీ సరౌండ్ సిస్టమ్, ఇలా మల్టీప్లెక్సులకు సమానంగా థియేటర్‌లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. దీని నిర్మాణం పూర్తయిన వెంటనే పక్కనే 500 గజాల్లో మరో ఇగ్లూ థియేటర్‌ను నిర్మించనున్నారు. ఈ ఇగ్లూ థియేటర్.. మల్టీప్లెక్స్ ట్రెండ్‌కు గట్టి పోటీ ఇస్తుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
Comments
Please login to add a commentAdd a comment