సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో కరోనా మహమ్మరి మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ సినిమా థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం నుంచి తెలంగాణలో సినిమా ప్రదర్శనలను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. మంగళవారం సినిమా థియేటర్ల నిర్వహణపై ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కొవిడ్ ఉద్ధృతి, ప్రేక్షకుల ఆరోగ్యం దృష్ట్యా థియేటర్లు, మల్టీఫ్లెక్స్ లు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సినిమా థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ వెల్లడించింది.
కాగా, తెలంగాణలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హైకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం మంగళవారం రాత్రి 9గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించింది.
Comments
Please login to add a commentAdd a comment