న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం నుంచి కోవిడ్ ఆంక్షలను కొద్ది మేర ఆంక్షలను సడలించనున్నామని ఢిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ (డీడీఎంఏ) శనివారం ప్రకటించింది. బస్సులు, మెట్రో రైళ్లను 100 శాతం సీటింగ్ సామర్థ్యంతో నడిపేందుకు అనుమతి ఉంటుంది.
సినిమా హాళ్లు, మల్టీప్లెక్సులలో 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో నడుపుకోవచ్చు. బిజినెస్–టు–బిజినెస్ (బీ2బీ) ఎగ్జిబిషన్లు సైతం ఆంక్షలకు లోబడి తెరచుకోవచ్చని చెప్పింది. పెళ్లిళ్లు, అంత్యక్రియలకు 100 మంది వరకూ అనుమతిచ్చింది. వ్యాక్సిన్ తీసుకున్న వారు, ఆర్టీపీసీఆర్ టెస్టు చేయించుకున్న వారితో స్పాలు నడుపుకోవచ్చని స్పష్టంచేసింది
Comments
Please login to add a commentAdd a comment