సినీ ప్రియులకు గుడ్‌ న్యూస్‌ చెప్పిన ఉద్ధవ్‌ ఠాక్రే సర్కార్‌ | Cinema Halls In Maharashtra To Reopen After October 22 | Sakshi
Sakshi News home page

సినీ ప్రియులకు తీపి కబురు చెప్పిన మహారాష్ట్ర ప్రభుత్వం

Published Sun, Sep 26 2021 11:54 AM | Last Updated on Sun, Sep 26 2021 11:54 AM

Cinema Halls In Maharashtra To Reopen After October 22 - Sakshi

సినీ ప్రియులకు తీపి కబురు అందించింది మహారాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో అక్టోబర్‌ 22 నుంచి థియేటర్స్‌ తెరచుకోనున్నట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. కరోనా నియమ, నిబంధనలను పాటిస్తూ సినిమా హాళ్లను తెరుస్తామని ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదలైంది. థియేటర్లు తెరచినా వందశాతం ఆక్యుపెన్సీకి అనుమతి ఇస్తారా? లేదంటే 50శాతంతోనే థియేటర్లు తెరవాలంటారో అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు థియేటర్స్‌ ఓపెన్‌ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన వెంటనే.. ఓ భారీ చిత్రం విడుదల తేదీని ఖరారు చేసుకుంది. 

థియేటర్లు పూర్తిస్థాయిలో అక్టోబరు 22 తర్వాత తెరుచుకుంటాయని మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడినే కొన్ని గంటల్లోనే ఓ భారీ చిత్రం విడుదల తేదీ ఖరారు చేసుకుంది. అక్షయ్‌కుమార్‌ హీరోగా ప్రముఖ దర్శకుడు రోహిత్‌ శెట్టి తెరకెక్కించిన చిత్రం ‘సూర్యవంశీ’. ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా విడుదల చేయనున్నట్టు దర్శకుడు వెల్లడించాడు. ఈ చిత్రంలో రణ్‌వీర్‌ సింగ్, అజయ్‌ దేవ్‌గణ్‌ అతిథి పాత్రల్లో నటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement