జిల్లాను అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతా | development of the district | Sakshi
Sakshi News home page

జిల్లాను అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతా

Published Mon, Jun 16 2014 12:06 AM | Last Updated on Thu, Jul 11 2019 5:07 PM

జిల్లాను అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతా - Sakshi

జిల్లాను అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతా

- అభివృద్ధే ఉద్యమంగా ముందుకు సాగుతాం
- రాజకీయాలకతీతంగా అందరూ కలిసి రండి
- విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి
- నకిరేకల్‌లో భారీ స్వాగత సభ
- పలువురు టీఆర్‌ఎస్‌లో చేరిక

నకిరేకల్: అభివృద్ధిలో జిల్లాలను తెలంగాణ రాష్ట్రంలో అగ్రగామిగా నిలుపుతానని విద్యాశాఖ మంత్రి గుంతకండ్ల జగదీష్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ విద్యా శాఖ మంత్రిగా బాధ్యత లు చేపట్టిన తరువాత నకిరేకల్‌కు వచ్చిన జగదీష్‌రెడ్డికి స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం ఆధ్వర్యంలో స్థానిక మెయిన్ సెంటర్‌లో ఆది వారం రాత్రి సన్మాన సభ ఏర్పాటు చేశారు. తొ లుత పట్టణ శివారు నుంచి మంత్రికి ఎదురేగి ఘన స్వాగతం పలికారు. ఓపెన్ టాప్ జీప్‌పై మంత్రితో పాటు ఎంపీ బూర నర్సయ్యగౌడ్, నకిరేకల్, తుంగతుర్తి ఎమ్మెల్యేలు వేముల వీరే శం, గాదరి కిషోర్‌లు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.

అధికారం వచ్చిందని నిర్లక్ష్యం చేయకుండా అభివృద్ధేలక్ష్యంగా పనిచేస్తానని చె ప్పారు.  సీమాంధ్రపాలకులు చేసిన ద్రోహానికి తెలంగాణ ప్రాంతం అభివృద్ధిలో పూర్తిగా వెనుకబడిపోయిందన్నారు. దీనిని ప్రగతిపథంలో తీసుకురావాలంటే పార్టీలకతీతంగా అందరూ కలిసిరావాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో అభివృద్ధి ఉద్యమం కొనసాగాలంటే ఆంధ్రాపార్టీల్లో ఉన్న వారంతా టీఆర్‌ఎస్‌లో చేరాలని కో రారు. ప్రజలు ఎన్నో నిర్బం ధాలు, కేసులు ఎదుర్కొని  తెలంగాణను సాధించుకున్నారని వారి ముఖాల్లో చిరునవ్వులు చిందేవిధంగా సమస్యలను పరిష్కరిస్తానన్నారు.
 
విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చేస్తా
‘నేను చిన్నప్పుడు మా గ్రామంలోని పాఠశాలలో చెట్టుకింద కూర్చొని చదువు కున్నా.. మంత్రిగా పర్యటనలో భాగంగా ఆదివారం మా పాఠశాలకు వెళ్లినప్పుడు  విద్యార్థులు చెట్ల కిందనే కూర్చొని విద్యనభ్యసిస్తున్నారు’ అని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పక్కా గదులు, మూత్రశాలలు నిర్మిస్తానని హామీ ఇచ్చారు. ముఖ్య ంగా కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందించాలన్నది కేసీఆర్ కలలు కన్న ప్రాజెక్టు అని తెలిపారు. ముమ్మాటికీ ఈ ప్రాజెక్టును అ మలు చేసి తీరుతామన్నారు. భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ జిల్లాను మరింత అభివృద్ధి చేస్తానన్నారు.

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ మంత్రి జగదీష్‌రెడ్డి మార్గదర్శకుడిగా ఉంటూ తనను ముందుకు నడిపించారన్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో నాడు అసెంబ్లీ గేట్  ముందు ఆందోళన చేసినప్పుడు పోలీ సులు తనను చిత్ర హింసలకు గురి చేశారన్నా రు. అయితే నేడు తెలంగాణ ఉద్యమం పుణ్యమాని ఎమ్మెల్యేగా గెలిచాక ఆ పోలీసులే సెల్యూట్ కొట్టి గౌరవిస్తున్నార న్నారు.  

ఈ సభలో టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బండ నరేం దర్‌రెడ్డి, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య,హైకోర్టు న్యాయవాది భరత్‌కుమార్, డాక్టర్స్ జేఏసీ జిల్లా కన్వీనర్ డాక్టర్ రాపోలు రఘునందన్, కట్టంగూర్, శాలిగౌరారం జెడ్పీటీసీలు మాద యాదగిరి, ఐయితగోని సునిత, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు సోమయాదగిరి, మారం భిక్షంరెడ్డి, సిలివేరు ప్రభాకర్, సుదర్శన్‌రెడ్డి, యానాల పాపిరెడ్డి, అశోక్‌రావు, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు పల్‌రెడ్డి నర్సింహారెడ్డి, అయితగోని వెంకన్న, రహీం ఖాన్, శ్రీనివాస్, బందెల రాములు, మాదగొని సైదులు నాయకులు పూజర్ల శంభయ్య, వీర్లపా టి రమేష్, పెండెం సంతోష్, గద్దపాటి దాన య్య, కొడెదల చంద్రయ్య, బొజ్జ సుందర్,  రవీందర్‌రెడ్డి, సైదులు, నకిరేకంటి నరేందర్ ఉన్నారు.
 
టీఆర్‌ఎస్‌లో భారీగా చేరికలు
నకిరేకల్‌లో మంత్రి జగదీష్‌రెడ్డి సమక్షంలో ఎమ్మెల్యే వీరేశం ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని పలు మండలాల నుంచి వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరా రు. టీడీపీ రాష్ట్రకార్యనిర్వాహక కార్యదర్శి రేగ ట్టే మల్లికార్జున్‌రెడ్డి, తక్కళపల్లి ప్రభాకర్‌రావులతో పాటు మరికొదరు టీఆర్‌ఎస్‌లో చేరారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement