
అనంతపురం ఎడ్యుకేషన్: కార్పొరేట్ కళాశాలల విద్యా పథకంలో భాగంగా 2018–19 విద్యా సంవత్సరానికి కార్పొరేట్ జూనియర్ కళాశాలల ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని సాంఘిక సంక్షేమశాఖ ఉపసంచాలకులు లక్ష్మానాయక్ ఓ ప్రకటనలో తెలిపారు. పదో తరగతిలో జీపీఏ 7, ఆపైన పాయింట్లు వచ్చిన విద్యార్థులు దీనికి అర్హులని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారికి మాత్రమే అవకాశం ఉంటుందన్నారు.
జిల్లాలో ఎస్సీ బాలికలకు 62, బాలురకు 41, ఎస్టీ బాలికలకు 18, బాలురకు 11, బీసీ బాలికలకు 34, బాలురకు 22, బీసీ–సీ బాలికలకు 11, బాలురకు 7, ఈబీసీ బాలికలకు 7, బాలురకు 4. మైనార్టీ బాలికలకు 9, బాలురకు 6, దివ్యాంగ విద్యార్థులకు 7 సీట్లు ఉన్నాయన్నారు. వెబ్‌సైట్ ద్వారా ఈనెల 6లోగా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.