అనంతపురం రూరల్ :
అనంతపురం రూరల్ మండల పరిధిలోని నరేంద్ర డిగ్రీ కళాశాలలో జర్నలిస్టుల పిల్లలకు ఉచితంగా డిగ్రీ విద్యతోపాటు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు సీఆర్‌ఐటీ కళాశాల డైరెక్టర్ అరుణ్‌కుమార్ రెడ్డి తెలిపారు. ఈమేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. మూడేళ్ల డిగ్రీతోపాటు ప్రభుత్వ ఉద్యోగ పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ కూడా ఇవ్వనున్నామన్నారు. ఈ అవకాశాన్ని జర్నలిస్టులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వివరాలకు సెల్ : 9133308557లో సంప్రదించాలన్నారు.