'కేజీ టు పీజీ' ఉచిత విద్యకు సహకారం: టాటా
'కేజీ టు పీజీ' ఉచిత విద్యకు సహకారం: టాటా
Published Wed, Aug 6 2014 5:28 PM | Last Updated on Wed, Aug 15 2018 9:04 PM
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పునఃనిర్మాణంలో టాటా గ్రూప్ సంస్థలు భాగస్వామ్యం కావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. బుధవారం కేసీఆర్‌తో టాటా గ్రూప్ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ భేటీ అయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ.. పారిశ్రామిక, ఐటీ, విద్యా, మౌళిక సదుపాయాల కల్పనలో టాటా గ్రూప్ సహకారం తీసుకుంటాం అని అన్నారు.
తమ సంస్థల అనుభవం, సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తామని కేసీఆర్‌కు టాటా గ్రూప్ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ హామీ ఇచ్చారు. కేజీ టు పీజీ ఉచిత విద్యా పథకానికి సహకారమందిస్తామన్నారు. మురికివాడలు లేని నగరంగా హైదరాబాద్‌ను మార్చేందుకు సహకారం అందిస్తామని మిస్త్రీ తెలిపారు.
Advertisement