పేదలకు ఉచిత విద్యను దూరం చేస్తున్న టీడీపీ
18న విజయవాడలో ధర్నా
గిరిజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు భూషణ్‌రావు
డుంబ్రిగుడ: రేషనలైజేషన్ ముసుగులో దళిత, గిరిజన, బడుగు బలహీన వర్గాలకు ప్రభుత్వం ఉచిత విద్యను దూరం చేస్తోందని గిరిజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు కె.భూషణ్‌రావు అన్నారు. ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ రేషనలైజేషన్ ముసుగులో రాష్ట్రవ్యాప్తంగా 3,500 పాఠశాలలు మూసివేసిన చంద్రబాబు ప్రభుత్వం ఈ ఏడాదిలో 5,475 ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు ఎత్తివేసేందుకు ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.
ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లను ఎత్తివేసే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషష్ల కల్పనకు చట్టం చేయాలని, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ పథకాన్ని సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేవారు. డిమాండ్లు అమలు చేయాలని కోరుతూ ఈ నెల 18న విజయవాడలో చేపట్టబోయే ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘం నాయకుడు వెంకటస్వామి ఉన్నారు.