పేదలకందని ‘కార్పొరేట్’ చదువు
అమలు కాని విద్యాహక్కు చట్టం
ప్రయివేటు పాఠశాలలో 25 శాతం సీట్ల కేటాయింపు వట్టిమాటే!
మూడేళ్లుగా పట్టించుకోని విద్యాశాఖ అధికారులు
బాన్సువాడ : ప్రయివేటు పాఠశాలలలో 25 శాతం సీ ట్లు పేదలకు కేటాయించాలని, ఉచితంగా విద్యను అందించాలని ఏటా విద్యాశాఖ ప్రకటనలు గుప్పిస్తున్నా, అమలుకు మాత్రం నోచుకోవడం లేదు. విద్యా హక్కు చట్టం వచ్చి ఐదేళ్లు గడుస్తున్నప్పటికీ, ఈ నిబంధన గురించి పట్టించుకున్న నాథుడు లేడు. అన్ని ప్రయివేటు పాఠశాలలలో 25 శాతం సీట్లు పేద కుటుంబాల పిల్లలకు కేటాయించాలని, ఈ వ్యయాన్ని ప్రభుత్వం,ప్రరుువేటు పాఠశాలల యాజమాన్యం సంయుక్తంగా భరించాలని గత ఏడాది సుప్రీంకోర్టు సూచించి నా ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఇప్పటికే పాఠశాలలు ప్రవేశాలను ప్రారంభించారుు.ఈసారి అరుునా పేద పిల్లలకు న్యాయం జరిగేలా చూడాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నారుు.
సుప్రీం కోర్టు ఆదేశించినా!
ప్రరుువేటు, కార్పొరేట్ బడులలో పేద విద్యార్థులకు ఉచిత చదువు కలగా మారింది. జిల్లాలో సుమారు ప్రరుువేటు 695 పాఠశాలలు ఉన్నా యి. వీటిలో కొన్ని తప్ప, చాలా వరకు పాఠశాలలు పేదలకు సీట్లు కేటాయించడం లేదు. విద్యాహక్కు చట్టం సూచించినా, అత్యున్నత న్యాయస్థానం ఆదేశించినా యూజమాన్యాలు పెడ చెవిన పెడుతున్నారుు. విద్యాహక్కు చట్టం ప్రకారం 25 శాతం సీట్లు పేద విద్యార్థులకు కేటాయించాల్సిందేనని సుప్రీం కోర్టు గతంలో చెప్పింది. దీని ప్రకారం జిల్లాలో దాదాపు పది వేల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరాలి. మూడేళ్లుగా ఈ నిబంధన అమలు కాకపోవడంతో దాదాపు 30 వేల మంది పేద విద్యార్థులు ఈ అవకాశానికి దూరమయ్యారు. ఈసారి ఈ నిబంధనను పకడ్బందీగా అమలు చేస్తామని విద్యాశాఖాధికారులు చెబుతున్నారు. దీనితో ప్రభుత్వ బడుల మనుగడకు కొంత విఘాతం ఏర్పడుతుందనే అభిప్రాయం కూడా అక్కడక్క డా వ్యక్తమవుతోంది.
ఫీజులు ఎవరు భరించాలి!
ఏటా ఒక్కో పాఠశాలో ఒకటో తరగతిలో సుమా రు 60 మంది పిల్లలు చేరుతున్నారు. వారిలో 15 సీట్లు పేదలకు కేటాయించాలి. పేద విద్యార్థికి ఏడాదికి రూ. పది వేల వరకు ఫీజు ఉంటుం దని అంచనా. దీన్ని ప్రరుువేటు భాగస్వామ్యం లో ప్రభుత్వం చెల్లిస్తుందా? మొత్తం ప్రభుత్వమే భరిస్తుందా అనేది తేలాల్సి ఉంది.
చట్టం అమలైతే
ఏదేమైనా విద్యాహక్కు చట్టం పటిష్టంగా అమలైతే పేద విద్యార్థులకు కార్పొరేట్, ప్రరుువేటు బడులలో చదువుకొనే అవకాశం లభిస్తుంది. నా ణ్యమైన విద్య అందుతుంది. పిల్లలను చదివించాలన్న తపనతో అప్పులు చేస్తున్న తల్లిదండ్రులకు ఊరట లభిస్తుంది. సామాజికంగా పేద, ధ నికవర్గాలు అనే భావనతోపాటు బడుగు, బల హీనవర్గాలు అనే భావన తొలగిపోతుంది. భవి ష్యత్తులో ఉన్నత విద్యకు అవకాశాలు మెరుగుపడతాయి. మరోవైపు, దీనితో పాఠశాలల మనుగడ ప్రమాదంలో పడవచ్చని ఉపాధ్యాయ సం ఘాలు ఆరోపిస్తున్నాయి. ఉచిత నిర్బంధ విద్య ను అందించాలన్న బాధ్యత నుంచి తప్పుకోవడానికి ఇదొక సాకు అని వారు భావిస్తున్నారు.
‘ఉచితం’ కల
Published Thu, Jun 11 2015 3:56 AM | Last Updated on Sun, Sep 3 2017 3:31 AM
Advertisement
Advertisement