సూర్యాపేట : రాష్ర్ట ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నోట వెలువడిన ఉచిత విద్య, కామన్ స్కూల్ విధానం అనే పదాలు విద్యా వ్యవస్థలోనే పెనుమార్పులకు శ్రీకారం చుట్టనున్నాయని ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి అన్నారు. ఆదివారం తెలంగాణ వికాస సమితి జిల్లా శాఖ ఆధ్వర్యంలో సూర్యాపేటలో ‘కేజీ నుంచి పీజీ వరకు ఉ చిత విద్య’ అనే అంశంపై నిర్వహించిన వర్‌కషాప్‌లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రభు త్వ విద్య ప్రస్తుతం శరవేగంగా ప్రైవేట్ వైపు వెళ్తుందాన్నరు.
అన్ని వర్గాల ప్రజలు ప్రైవేట్ విద్యవైపు మొగ్గు చూపడంతో పేద, మధ్య తరగతి వర్గాలపై ఆర్థికభారం పడుతుందన్నారు. కామన్‌స్కూల్ విధానం ద్వారా అన్ని వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలన్న ముఖ్యమంత్రి ఆకాంక్ష నెరవేరడానికి కావాల్సిన ప్రణాళికను అందజేయాలని ఆయన కోరా రు. తెలంగాణ వికాస సమితి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకటేశ్వర్‌రావు, అశోక్‌రెడ్డి మాట్లాడుతూ త్వరలో ప్రతి జిల్లాలో సదస్సులు ఏర్పాటు చేసి అన్ని వర్గాల వారి సల హాలు స్వీకరిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు లక్ష్మీ నారాయణ, సీతారాం, ఉపేందర్‌రెడ్డి, సురేష్‌బాబు, లెక్చరర్లు నారాయణరెడ్డి, వివేకన్‌రెడ్డి, రా మాంజనేయులు, మధుసూదన్‌రెడ్డి, గోనారెడ్డి, ఎంవీఎఫ్ వెంకట్‌రెడ్డి, స్టేట్ రీసోర్స్ పర్సన్ వెంకట్‌రెడ్డి, ఉపాధ్యాయ సం ఘాల నేతలు, తెలంగాణ వికాస సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి వెంకటలక్ష్మి పాల్గొన్నారు.
విద్యావ్యవస్థలో పెనుమార్పులు
Published Mon, Sep 29 2014 1:46 AM | Last Updated on Wed, Aug 15 2018 7:50 PM
Advertisement