Common School System
-
చదువు‘కొనేలా’ మార్చిన ఘనత కేసీఆర్‌దే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వస్తే కామ న్ స్కూల్ విద్యావిధానం తీసుకొస్తానని సీఎం కేసీఆర్ ప్రగల్భాలు పలికారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శించారు. తన మనుమడు, తన డ్రైవర్ కొడుకు ఒకే పాఠశాలలో చదివే విద్యావిధానం తెస్తానన్న కేసీఆర్ ఇప్పుడేం చేస్తున్నారని, ఆయన చెప్పిన కామన్ స్కూల్ విధానం ఎక్కడుందని ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల తో మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణ లేకుండా పోయిందని, కార్పొరే ట్ విద్యా విధానానికి పెద్దపీట వేశారని ఆరోపించారు. ‘చదువుకుందాం’నినాదాన్ని కాస్తా ‘చదువుకొందాం’గా మార్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఫీజుల కలెక్షన్ విషయంలో దేశంలో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉందన్నారు. 2007 నుంచి ఇప్పటివరకు దాదాపు 400 శాతం ఫీజు పెరిగిందని చెప్పారు. విద్యాసంస్థలు 5 శాతం కన్నా ఎక్కువ లాభాల్లో ఉండకూడదన్న నియమాన్ని అతిక్రమించి దాదాపు 70 శాతం లాభాలతో నడుస్తున్న పాఠశాలలు ఉన్నాయని తెలిపారు. ఫీజుల కోసం విద్యార్థులను డీటెయిన్ చేస్తున్నారన్నారు. మూడేళ్ల పిల్లలకు బ్యాగు బరువు తప్పడం లేదని, విద్యార్థుల బరువు కంటే వారి బ్యాగే ఎక్కువ బరువుంటోందని అన్నారు. రాష్ట్రంలో నిబంధనలకు మించి ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలల వివరాలను తమ యువజన విభాగం సేకరించిందని చెప్పారు. వారంలోగా ఆయా విద్యాసంస్థలు తగిన చర్యలు తీసుకోకపోతే వారి పనిపడతామని లక్ష్మణ్ హెచ్చరించారు. మజ్లిస్‌కు ప్రతిపక్ష హోదా ఇస్తే పోరాటం.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక అక్షరాస్యత ఒక్క శాతం కూడా పెరగలేదని లక్ష్మణ్ ఆరోపిం చారు. గత పాలకులు 60 ఏళ్లలో చేసిన అప్పులని కేసీఆర్ ఆరేళ్లలోనే చేశారన్నారు. మజ్లిస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇస్తే తమ పోరాటం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. -
విద్యావ్యవస్థలో మార్పు వస్తేనే అభివృద్ధి
కేజీ టు పీజీ వరకు కామన్ విద్యావిధానం అమలు చేయాలి అందరికీ నాణ్యమైన విద్యను అందించాలి ప్రొఫెసర్ హరగోపాల్ సిద్దిపేట అర్బన్ : ప్రస్తుత విద్యా వ్యవస్థ మారితేనే దేశం బాగుపడుతుందని, కేజీ టూ పీజీ వరకు కామన్ స్కూల్ విధానం ద్వారా ఉచిత నిర్బంధ విద్యను ప్రభుత్వం అందజేయాలని అఖిల భారత విద్యా పోరాట యాత్ర ప్రధాన కార్యదర్శి, ప్రొఫెసర్ హరగోపాల్ పేర్కొన్నారు. మంగళవారం సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యా పరిరక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో హరగోపాల్ ముఖ్య అతిథిగా మాట్లాడుతూ నాణ్యమైన విద్యను అన్ని వర్గాల విద్యార్థులకు అందిస్తేనే పునర్నిర్మాణం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో మానవీయ తెలంగాణను నిర్మించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పాఠశాలలు మనుషుల్ని నిర్మించే కేంద్రాలుగా మార్చాల్సిన అవసరం ప్రభుత్వాలపై ఉందన్నారు. ప్రజా ఉద్యమాలు, పోరాటాలు లేకుండా అవి జరగవన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో పాఠశాలలు, కళాశాలల స్థాయిలో మొత్తం ప్రణాళికలను, పాఠ్యాంశాలను మార్చాల్సిన అవసరం ఉందన్నారు. విద్య యొక్క ప్రధాన లక్ష్యం కుల, మతాలకు అతీతంగా సామాజిక స్పృహ కలిగిన పౌరులను, మేధావులను సృష్టించే విధంగా ఉండాలన్నారు. పిల్లలకు పోషకాహారం, నాలుగు జతల బట్టలు, బూట్లు సమకూర్చి వారికి విద్యను బోధిస్తేనే అర్థమవుతుందని తెలిపారు. అన్ని మతాలను గౌరవించే సమాన, సమాంతర విద్యను అన్ని వర్గాలకు అందించాలని, విద్యలో మత రాజకీయాలను చొప్పించరాదన్నారు. ఉపాధ్యాయ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యా పరిరక్షణ కమిటీ ఏర్పడి విద్యా పోరాట యాత్రను దేశ వ్యాప్తగా నిర్వహించడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ర్టంలోని పది జిల్లాల్లో కూడా ఈ యాత్ర చేపట్టడం జరిగిందన్నారు. విద్య పరిరక్షణ కోసం సుదీర్ఘంగా వివరించిన వినతిపత్రాన్ని విద్యా మంత్రి కడియం శ్రీహరికి త్వరలో అందజేస్తామన్నారు. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి సభ్యులు డాక్టర్ పాపయ్య, టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, నాయకులు పొన్నమల రాములు, రాజారెడ్డి, గోపాల్‌రెడ్డి, డీటీఎఫ్ నాయకులు శ్రీనివాస్, రాజిరెడ్డి, నర్సింలు, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు ఖమ్మంపల్లి యాదగిరి, నాయకులు శ్రావణ్, సతీష్, పీవైఎల్ నాయకులు జాన్‌రాజ్, ఏఐఎస్ఎఫ్ నాయకులు బెజ్జంకి సంపత్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యావ్యవస్థలో పెనుమార్పులు
సూర్యాపేట : రాష్ర్ట ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నోట వెలువడిన ఉచిత విద్య, కామన్ స్కూల్ విధానం అనే పదాలు విద్యా వ్యవస్థలోనే పెనుమార్పులకు శ్రీకారం చుట్టనున్నాయని ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి అన్నారు. ఆదివారం తెలంగాణ వికాస సమితి జిల్లా శాఖ ఆధ్వర్యంలో సూర్యాపేటలో ‘కేజీ నుంచి పీజీ వరకు ఉ చిత విద్య’ అనే అంశంపై నిర్వహించిన వర్కషాప్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రభు త్వ విద్య ప్రస్తుతం శరవేగంగా ప్రైవేట్ వైపు వెళ్తుందాన్నరు. అన్ని వర్గాల ప్రజలు ప్రైవేట్ విద్యవైపు మొగ్గు చూపడంతో పేద, మధ్య తరగతి వర్గాలపై ఆర్థికభారం పడుతుందన్నారు. కామన్‌స్కూల్ విధానం ద్వారా అన్ని వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలన్న ముఖ్యమంత్రి ఆకాంక్ష నెరవేరడానికి కావాల్సిన ప్రణాళికను అందజేయాలని ఆయన కోరా రు. తెలంగాణ వికాస సమితి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకటేశ్వర్రావు, అశోక్‌రెడ్డి మాట్లాడుతూ త్వరలో ప్రతి జిల్లాలో సదస్సులు ఏర్పాటు చేసి అన్ని వర్గాల వారి సల హాలు స్వీకరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు లక్ష్మీ నారాయణ, సీతారాం, ఉపేందర్‌రెడ్డి, సురేష్‌బాబు, లెక్చరర్లు నారాయణరెడ్డి, వివేకన్‌రెడ్డి, రా మాంజనేయులు, మధుసూదన్‌రెడ్డి, గోనారెడ్డి, ఎంవీఎఫ్ వెంకట్‌రెడ్డి, స్టేట్ రీసోర్స్ పర్సన్ వెంకట్‌రెడ్డి, ఉపాధ్యాయ సం ఘాల నేతలు, తెలంగాణ వికాస సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి వెంకటలక్ష్మి పాల్గొన్నారు.