
సాక్షి,సూర్యాపేట జిల్లా: నూతనకల్ మండలం మిర్యాల గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మిర్యాల మాజీ సర్పంచ్ చక్రయ్య గౌడ్(61) పై గొడ్డలితో దుండగుల దాడి చేశారు. ఈ దాడిలో తీవ్ర గాయాల పాలైన బాధితుణ్ని అతని కుటుంబ సభ్యులు అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
అయితే హత్యకు పాల్పడిన నిందితుల ఇంటిపై బాధితుడి బంధువుల దాడి చేశారు. దీంతో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పికెటింగ్ ఏర్పాటు. సూర్యాపేట ఏరియా హాస్పిటల్ వద్ద భారీ బందోబస్తు మోహరించారు.