బాల్కొండ : తెలంగాణ రాష్ర్టంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని ముప్కాల్ ఉన్నత పాఠశాలలో *21.20 లక్షల నిధులతో నిర్మించిన అదనపు తరగతి గదులను ప్రారంభించారు.
ఈసందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పేద విద్యార్థులందరికీ ఆంగ్ల విద్య అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రతి మండలానికి ఒక గురుకుల పాఠశాలను 15 ఎకరాల్లో నిర్మిస్తామన్నారు. విద్యా విలువ వెల కట్ట లేనిదాన్నరు. విద్యా అందరికి బ్రహ్మస్త్రం అన్నారు.
ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం లేకనే...
ప్రభుత్వ పాఠశాలలపై ప్రజలకు నమ్మకం లేకనే కూలి పనిచేసైనా తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలకు పంపుతున్నారన్నారు. ప్రభుత్వ పా ఠశాలల్లో మంచి విద్యనందిస్తే ప్రైవేట్ పాఠశాలలకు ఎందుకు పంపుతారన్నారు. ఉపాధ్యాయులు సమయ పాలన పాటించని వారు కూ డా ఉన్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉంటారన్నారు. వారందరు అంకిత భావంతో పని చేయాలని సూచించారు.
కరెంట్ కొరతను అధిగమిస్తాం..
రాష్ట్రంలోప్రస్తుతం విద్యుత్తు కొరత ఉన్న మాట వాస్తవమే అన్నారు. తెలంగాణకు 8 వేల మెగావాట్ల విద్యుత్తు అవసరం ఉంటే ప్రస్తుతం సగం నాల్గు వేల మెగావాట్ల విద్యుత్తు మాత్రమే ఉత్పత్తి అవుతుందన్నారు. వచ్చే మూడేళ్లలో 24 గంటల విద్యుత్తును అందిస్తామన్నారు. సా గుకు ఏడు గంటల విద్యుత్తు సరఫరా అందించడానికి కృషి చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వా ల హయాంలో అక్రమాలకు పాల్పడిన వారి భ రతం పడుతామన్నారు. అడ్డగోలుగా ఇళ్లు కేటాయించుకుని బిల్లులు కాజేసిన పెద్దల భరతం పట్టి కేసులు పెడుతామన్నారు. అవసరమైతే జైలుకు కూడా పంపుతామని హెచ్చరించారు. బోగస్ బిల్లులను రికవరీ చేస్తామన్నారు. ఈనెల 19 నిర్వహించే కుటుంబ సర్వేకు అందరు సహకరించాలని కోరారు.
తెలంగాణకు అన్యాయం
సీమాంధ్ర పాలకుల పాలనలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని పోచారం అన్నా రు. మండలంలోని పోచంపాడ్ కూడలీ వద్ద గల బాలికల గురుకుల పాఠ శాలలో నూతనంగా *1.5 కోట్ల నిధులతో నిర్మించిన వసతి గృహన్ని శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, జడ్పీ చైర్మన్ దాఫేధర్ రాజులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మం త్రి మాట్లాడుతు.. సొమ్ము మనదైతే.. సోకు ఆంధ్రోళ్లు చేశారన్నారు. తెలంగాణ నిధులు, ఉద్యోగులను కొల్లగొట్టారన్నారు.
సన్మానాలు వద్దు...
మీ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టడానికి వచ్చే ప్రజాప్రతినిధులకు పూల మాలలతో స న్మానాలు చేయడం వద్దని మంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మాటలతోనైన సన్మానించ వచ్చన్నారు. సన్మానాల పేరిట గంటల సమయాన్ని వృథా చేసుకోవడం సరికాదన్నారు.
కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య
Published Sat, Aug 9 2014 4:33 AM | Last Updated on Sat, Sep 2 2017 11:35 AM
Advertisement