మత్స్య సహకార సంఘాల సమస్యలను పరిష్కరించాలి
మంత్రి పోచారానికి సంఘం ప్రతినిధుల వినతి
సిద్దిపేట అర్బన్: తెలంగాణ రాష్ట్రంలోని మత్స్య సహకార సంఘాల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిద్దిపేటకు చెందిన జిల్లా మత్స్య సహకార సంఘం మాజీ అధ్యక్షుడు మంతూరి బాల్‌నర్సయ్య అధ్వర్యంలో వ్యవసాయ, పాడి పరిశ్రమ, మత్స్య శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిని బుధవారం హైదరాబాద్‌లో కలిసి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా మంతూరి బాల్‌నర్సయ్య గురువారం సిద్దిపేటలో విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణలో చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేయాలని, చేపల విక్రయాలకు ప్రతి మండల కేంద్రంలో మార్కెట్ స్టాల్స్ నిర్మించాలని, ప్రతి జిల్లా కేంద్రంలో శీతల గిడ్డంగి నిర్మించాలని, ప్రతి రోజు మీడియాలో, పత్రికల్లో చేపల మార్కెట్ ధరల వివరాలు తెలుసుకునే అవకాశం కల్పించాలని, సంఘాల పరిధిలోని చెరువులు, కుంటల్లో చేప పిల్లలు పెంచుకునేందుకు ఉచితంగా సరఫరా చేయాలని మంత్రిని కోరినట్లు తెలిపారు. ఈ ప్రతులను ముఖ్యమంత్రికి, భారీ నీటి పారుదల శాఖ మంత్రికి అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో శ్రీను, బైరయ్య, లింగం, రాజు, మల్లేశం, శంక ర్ తదితరులు పాల్గొన్నారు.